జలమే జీవం..పొదుపే మంత్రం: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా కోట్లాది మంది భారతీయులతో పలు విషయాలపై మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం నీటికొరత సమస్య పట్టిపీడిస్తోందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జలాల సద్వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జలమే జీవమని ,నీటిని పొదుపుగా వాడుకోవడంతోపాటు కాపాడుకోవాలన్నారు ప్రధాని. నీటి పొదుపుపై ఇప్పటికే గ్రామ ప్రధాన్‌లకు లేఖ రాశానన్న మోదీ… గ్రామ ప్రాంతాల్లో ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కలిగించాలని కోరానని […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:54 pm, Sun, 30 June 19
జలమే జీవం..పొదుపే మంత్రం: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రధాని మోదీ తన మనసులోని మాటల్ని పంచుకున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా కోట్లాది మంది భారతీయులతో పలు విషయాలపై మాట్లాడారు. దేశంలో ప్రస్తుతం నీటికొరత సమస్య పట్టిపీడిస్తోందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ జలాల సద్వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జలమే జీవమని ,నీటిని పొదుపుగా వాడుకోవడంతోపాటు కాపాడుకోవాలన్నారు ప్రధాని.

నీటి పొదుపుపై ఇప్పటికే గ్రామ ప్రధాన్‌లకు లేఖ రాశానన్న మోదీ… గ్రామ ప్రాంతాల్లో ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన కలిగించాలని కోరానని చెప్పారు. నీటి సద్వినియోగం ప్రతిఒక్కరి బాధ్యతగా చెప్పిన ప్రధాని… దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు సినిమా తారలు,క్రీడాకారులు, మీడియా కృషిచేయాలని విఙ్ఞప్తి చేశారు.