AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిగదిగో..ఆకాశంలో… ‘ ఎగిరే పళ్లెం ‘.. మళ్ళీ అదే మిస్టరీ !

ఫ్లయింగ్ సాసర్.. అంటే ఎగిరే పళ్లెం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ! ఈ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఏమిటో ఇప్పటికీ మనిషికి సవాలుగానే నిలిచింది. ఆకాశంలో అది ఎప్పుడు, ఎవరికి కనబడుతుందో, ఎటు నుంచి ఎటు పోతోందో నేటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ‘ ఇదిగో చూసాం..’ ‘ అదిగో చూసాం ‘ అని దీన్ని చూసినవాళ్లు చెబుతున్నారే తప్ప, దీని మిస్టరీ మాత్రం సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూనే ఉంది. ఏలియన్స్ పై పరిశోధనలు జరుపుతున్నవాళ్ళు పనిలో […]

అదిగదిగో..ఆకాశంలో... ' ఎగిరే పళ్లెం '.. మళ్ళీ అదే మిస్టరీ !
Pardhasaradhi Peri
|

Updated on: Jun 30, 2019 | 1:16 PM

Share

ఫ్లయింగ్ సాసర్.. అంటే ఎగిరే పళ్లెం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ! ఈ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఏమిటో ఇప్పటికీ మనిషికి సవాలుగానే నిలిచింది. ఆకాశంలో అది ఎప్పుడు, ఎవరికి కనబడుతుందో, ఎటు నుంచి ఎటు పోతోందో నేటికీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. ‘ ఇదిగో చూసాం..’ ‘ అదిగో చూసాం ‘ అని దీన్ని చూసినవాళ్లు చెబుతున్నారే తప్ప, దీని మిస్టరీ మాత్రం సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూనే ఉంది. ఏలియన్స్ పై పరిశోధనలు జరుపుతున్నవాళ్ళు పనిలో పనిగా ఈ ఫ్లయింగ్ సాసర్ల మీదా ఫోకస్ పెట్టి అదేపనిగా తమ ప్రకటనలను ‘ జారీ ‘ చేస్తున్నారు. ఇటీవల కాలిఫోర్నియాలో ఓ వ్యక్తికి స్పష్గంగా ఓ ఎగిరే పళ్లెం కనబడింది. అక్కడి ఆరెంజ్ కౌంటీ లోని షెర్లీ హెలీషియా అనే ఆ వ్యక్తికి గత జూన్ 19 న డిస్క్ షేపులో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న యు ఎఫ్ ఓ కనబడగానే వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ కి ఎక్కించారు. ఇక ఇది వైరల్ కావడం ప్రారంభమైంది. ఈ వీడియో చూసినవారంతా దీనిపై చర్చించుకోవడం మొదలెట్టారు. ఇది కనబడిందంటే గ్రహాంతర జీవులు (ఏలియన్స్) ఉన్నట్టే లెక్క. ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి ? భూమిపై మానవుల కార్యకలాపాలను మానిటర్ చేయడానికి ఏలియన్స్ అంతరిక్షం నుంచి ఎగిరే పళ్లాల మీద వఛ్చి పోతుంటారు ‘ అని కొందరంటే..మరికొందరు.. బహుశా మానవాళిపై దాడి చేసే ప్రయత్నంలో వారు చేస్తున్న యోచనలో భాగమే ఇదై ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇక ఏలియన్స్ లేరని వాదించే వారు… ఈ వీడియోలో కనిపించింది డ్రోన్ అయి ఉంటుందని అంటున్నారు. ఇంకొంతమంది మే బీ ఇది సీక్రెట్ మిలిటరీ వెహికల్ అయివుంటుందని, హైపర్ సోనిక్ స్పీడ్ తో ట్రావెల్ చేసే ‘ సత్తా ‘ దీనికి ఉంటుందని నిట్టూర్చారు. ఏలియన్స్ ఉన్నారని తాను నమ్మడంలేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ ఎగిరే పళ్లెం తాలూకు వీడియో బయటకు రావడం విశేషం. యు ఎఫ్ ఓ ల చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించేందుకు తాము రహస్య మిషన్ ని నిర్వహిస్తున్నామని పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) ధృవీకరించిన నేపథ్యంలో ఈ ‘ వీడియో ‘ వ్యవహారం మళ్ళీ కథను మొదటికి తెచ్చింది.

Follow Us
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..
ప్రపంచ శక్తిగా భారత్.. మోదీ సర్కార్ సంస్కరణలతో నవశకానికి నాంది..
ప్రపంచ శక్తిగా భారత్.. మోదీ సర్కార్ సంస్కరణలతో నవశకానికి నాంది..
గుడ్లను పొదగేసేందుకు ఇంట్లోనే ఇంక్యూబేటర్ ఇలా..?
గుడ్లను పొదగేసేందుకు ఇంట్లోనే ఇంక్యూబేటర్ ఇలా..?