గుడ్‌న్యూస్: ఏపీలో ఫలించిన ‘ప్లాస్మా థెరపీ’..బాధితుడు డిశ్చార్జ్
ఏపీలో ఓ వైపు కరోనా వికృతరూపం దాల్చుతోంది. మరోవైపు రికవరీ రేటు కూడా బాగానే నమోదు అవుతోంది. అయితే, కరోనా పేషెంట్లకు అందించే చికిత్స విధానంలో పలుచోట్ల అమలు చేస్తున్న ప్లాస్మా థెరఫీ విధానాన్ని ఏపీలోనూ అనుసరిస్తున్నారు. కాగా,..

ఏపీలో ఓ వైపు కరోనా వికృతరూపం దాల్చుతోంది. మరోవైపు రికవరీ రేటు కూడా బాగానే నమోదు అవుతోంది. అయితే, కరోనా పేషెంట్లకు అందించే చికిత్స విధానంలో పలుచోట్ల అమలు చేస్తున్న ప్లాస్మా థెరఫీ విధానాన్ని ఏపీలోనూ అనుసరిస్తున్నారు. కాగా, కర్నూలు స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. ప్లాస్మా స్వీకరించిన కరోనా బాధితుడు ఆరోగ్యం మెరుగుపడటంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లుగా అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని కర్నూలు స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఐదుగురికి ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించామని చెప్పారు. వారిలో నలుగురు రీకవరీ అయ్యారని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మాదానం చేయాలని కోరారు.




