ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎట్టకేలకు కాలేజీల

  • Tv9 Telugu
  • Publish Date - 7:31 am, Tue, 30 June 20
ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో.. పీజీ మెడికల్‌ అడ్మిషన్లకు లైన్ క్లియర్..!

PG Medical admissions: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎట్టకేలకు కాలేజీల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ సోమవారం అంగీకరించింది. హైకోర్టు అంతిమ తీర్పునకు లోబడి ఫీజు చెల్లించే విధంగా 2020-21 సంవత్సరానికి అడ్మిషన్లు చేయనున్నట్లు పేర్కొంది. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల అసోయేషన్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు.