పీపీఈల ఎగుమతికి కేంద్రం అంగీకారం..
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్-19 వ్యాప్తి నివారణకు చికిత్సా పద్ధతుల్లో వినియోగిస్తున్న వ్యక్తిగత సంరక్షణ పరికరాల (పీపీఈ)
India allows PPE suit export: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్-19 వ్యాప్తి నివారణకు చికిత్సా పద్ధతుల్లో వినియోగిస్తున్న వ్యక్తిగత సంరక్షణ పరికరాల (పీపీఈ) ఎగుమతికి ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకోసం నిబంధనలు సడలిస్తూ, నెలకు 50 లక్షల పీపీఈలు ఎగుమతి చేయొచ్చని పేర్కొంది. గతంలో పీపీఈల ఎగుమతిని పూర్తిగా నిషేధించగా, ఇప్పుడు పరిమితుల విభాగంలో వీటిని చేర్చింది.
వివరాల్లోకెళితే.. ప్రతినెలా 1-3 తేదీల్లో డీజీఎఫ్‌టీ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. 10వ తేదీ కల్లా అనుమతులు, ఎవరికి ఎంత కోటా ఇచ్చారో వెల్లడవుతుంది ‘నెలకు 50 లక్షల పీపీఈల ఎగుమతి లైసెన్స్, అర్హత కలిగిన ఎగుమతిదార్లకు ఇవ్వాలని నిర్ణయించాం’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే పీపీఈలో భాగంగా ఉండే ఇతర వస్తువుల ఎగుమతిని మాత్రం నిషేధించారు. రాబోయే అయిదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 6000 కోట్ల డాలర్ల (సుమారు రూ.4.50 లక్షల కోట్ల) విలువైన పీపీఈలకు గిరాకీ వస్తుందని అంచనా.