వామపక్షాలకు పవన్ కల్యాణ్ దిమ్మతిరిగే షాక్

అందరు అనుకున్నట్లే బీజేపీ ఒడిలోకి చేరిపోయారు జనసేనాని పవన్ కల్యాణ్. ఏపీలో నెలకొన్ని అవినీతి, కుల రాజకీయాలకు చెరమగీతం పాడాలంటే బీజేపీ-జనసేన కలయిక అనివార్యమని ఆయన చెప్పారు. అదే సమయంలో ఇంత కాలం కలిసి పని చేసిన వామపక్షాలకు షాక్ ఇచ్చేలా మాట్లాడారు పవన్ కల్యాణ్. బీజేపీ నేతలతో జరిగిన సుదీర్ఘ మంతనాల తర్వాత రెండు పార్టీల నేతలు విజయవాడలోని ఒక హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు వ్యతిరేకంగా తమ కూటమి పని చేస్తుందని […]

వామపక్షాలకు పవన్ కల్యాణ్ దిమ్మతిరిగే షాక్
Follow us

|

Updated on: Jan 16, 2020 | 3:59 PM

అందరు అనుకున్నట్లే బీజేపీ ఒడిలోకి చేరిపోయారు జనసేనాని పవన్ కల్యాణ్. ఏపీలో నెలకొన్ని అవినీతి, కుల రాజకీయాలకు చెరమగీతం పాడాలంటే బీజేపీ-జనసేన కలయిక అనివార్యమని ఆయన చెప్పారు. అదే సమయంలో ఇంత కాలం కలిసి పని చేసిన వామపక్షాలకు షాక్ ఇచ్చేలా మాట్లాడారు పవన్ కల్యాణ్.

బీజేపీ నేతలతో జరిగిన సుదీర్ఘ మంతనాల తర్వాత రెండు పార్టీల నేతలు విజయవాడలోని ఒక హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు వ్యతిరేకంగా తమ కూటమి పని చేస్తుందని వెల్లడించారు. మరి ఇంతకాలం వామపక్షాలతో కలిసి ముందుకు సాగారు కదా అని ఓ విలేకరి ప్రశ్నిస్తే… తానేమీ వామపక్షాలకు బాకీ పడలేదని కొట్టి పారేశారు జనసేనాని. కొన్ని అంశాలపై రాజకీయ పార్టీలు కలిసి పనిచేస్తాయని, కూటమిగా ఏర్పడడం వెనుక అంశాలతో చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.