పవన్ సంచలన నిర్ణయం.. గ్రేటర్ ఎన్నికల నుంచి తప్పుకున్న జనసేన.. బీజేపీకి పూర్తి మద్దతు..
గ్రేటర్ ఎన్నికల బరిలో నుంచి అనూహ్యంగా జనసేన పార్టీ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో..
Janasena Party: గ్రేటర్ ఎన్నికల బరిలో నుంచి అనూహ్యంగా జనసేన పార్టీ తప్పుకుంది. ఈ విషయాన్ని స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ సంపూర్ణ మద్దతు బీజేపీకి ఉంటుందన్నారు. నామినేషన్ వేసిన జనసేన అభ్యర్ధులందరూ విత్‌డ్రా చేసుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నిరాశ చెందవద్దన్నారు. అలాగే ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా బీజేపీకి సహకరించాలని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌లతో భేటి అయిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కాగా, అటు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తాము జనసేన పార్టీ మద్దతు కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా బీజేపీ, జనసేన కలిసి పని చేస్తాయని అన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కావాలనుకుంటున్నారని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు ఉదాహరణ దుబ్బాక ఎన్నికేనని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్న బీజేపీతోనే మార్పు సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read:
జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. ఈ నెల 25న వారి ఖాతాల్లోకి రూ. 10 వేలు జమ.!
ఏపీ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్.. పంచారామాలకు 1,750 స్పెషల్ బస్సులు..