Pawan Kalyan: కాంగ్రెస్ Vs జనసేన.. పవన్ కల్యాణ్ తెలంగాణ టూర్‌తో పెరిగిన పొలిటికల్ హీట్.. బీజేపీ ఫుల్ ఖుష్..
మున్సిపల్ ఎన్నికల ఫైట్‌లో ఇప్పుడు అందరి దృష్టి పవన్ కల్యాణ్ పర్యటనపైనే నిలిచింది. అటు కూటమి ధర్మం.. ఇటు సొంత పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పవన్ ప్రచార బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్, జనసేన మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. పవన్ కల్యాణ్ ప్రభావం తెలంగాణపై ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ విమర్శలకు జనసేన ఇస్తున్న కౌంటర్లేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హీట్ నడుస్తోంది. అధికార, విపక్షాలు ప్రచార రంగంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎంట్రీ ఇప్పుడు పొలిటికల్ హీట్‌ను పెంచుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్ధతుగా పవన్ ప్రచారం చేయనున్నారు. దీంతో అన్న వస్తున్నారంటూ తెలంగాణ జనసేన నేతలు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులు సైతం బరిలో నిలిచారు. బీజేపీకి మద్దతు మద్దతే ఇటు పోటీపోటీనే అంటూ నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, వాళ్ల గెలుపుకోసం కూడా పవన్ ప్రచారం చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే పవన్ తెలంగాణ ఎంట్రీపై అప్పుడే నెక్ట్స్ లెవల్ రాజకీయం షురూ అయ్యింది. అధికార కాంగ్రెస్, జనసేన మధ్య మాటల యుద్ధం పొలిటికల్ కాక రేపుతోంది.
తెలంగాణలో జనసేనకు అసలు చోటే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. గతంలో తెలంగాణ భాష, సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడిన పవన్ కల్యాణ్‌ను ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మే ప్రసక్తే లేదని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పవన్ ఆంధ్రా రాజకీయాలు చూసుకుంటే సరిపోతుందంటూ విమర్శలు గుప్పించడం ఇప్పుడు రచ్చ లేపుతోంది. మహేష్‌కుమార్ గౌడ్ కామెంట్స్‌పై తెలంగాణ జనసేన నుంచి గట్టి కౌంటరే వచ్చింది. కాంగ్రెస్ కేవలం తెలంగాణ పార్టీనా…? బీఆర్ఎస్, బీజేపీలు కేవలం తెలంగాణలోనే పనిచేస్తున్నాయా…? వాళ్ల పార్టీల్లానే మాది కూడా ఓ పార్టీ అంటూ జనసేన ఎక్స్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జనసేన కేవలం ఆంధ్ర కోసం పెట్టిన పార్టీ కాదని…ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూస్తే ఊరుకునేదిలేదని ఫుల్ సీరియస్ అయ్యింది.
అసలు మహేష్‌కుమార్ గౌడ్‌కి పవన్ గురించి మాట్లాడే అర్హత లేదని జనసేన తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ అన్నారు. పవన్ గోల్డెన్ లెగ్ చూసి అధికార కాంగ్రెస్‌కి భయం పట్టుకుందన్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేస్తే బీజేపీ గెలిచింది కాబట్టి.. ఇక్కడా అలాంటి సీనే రిపీట్ అవుతుందని కాంగ్రెస్ నేతలు వణుకుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఈనెల 7,8 తేదీల్లో పవన్ తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. మరి ఆయన ఎంట్రీకి ముందే ఈ రేంజ్‌లో రచ్చ నడుస్తుంటే… ఆ తర్వాత పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
