అటు రాజకీయాలు, ఇటు సినిమాలు..రెండిటిలోనూ పవనే హాట్ టాపిక్ !

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తొలుత ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన జనసేన పవన్ కళ్యాణ్..

అటు రాజకీయాలు, ఇటు సినిమాలు..రెండిటిలోనూ పవనే హాట్ టాపిక్ !
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 29, 2020 | 3:54 PM

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తొలుత ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన జనసేన పవన్ కళ్యాణ్..ఆ తర్వాత మనసు మార్చుకుని బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ విషయం పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆయన నిర్ణయాన్ని పలు రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. ఇక పవన్  సినిమాల గురించి రోజుకో టాపిక్ ట్రెండ్ అవుతోంది. లాక్‌ డౌన్‌ తరువాత వకీల్ సాబ్‌ షూటింగ్‌ స్టార్ట్ చేసిన పవర్‌ స్టార్‌… పట్టుమని పదిరోజులు కూడా షూటింగ్‌ లో పాల్గొనకుండా పాలిటిక్స్‌లో బిజీ అయ్యారు. అయినా… పవన్‌ డేట్స్ కోసం లైన్‌లో ఉన్న డైరెక్టర్స్ మాత్రం పక్కా ప్లానింగ్‌తో సినిమాలు రెడీ చేస్తున్నారు.

వకీల్ సాబ్ తరువాత క్రిష్ సినిమా చేసేందుకు ఎప్పుడో ఓకే చెప్పారు పవన్‌.. ఇప్పటికే పవన్ లేకుండానే ఓ షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా పూర్తి చేశారు.. పవర్‌ స్టార్‌ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ ముద్దుగుమ్మలను హీరోయిన్స్‌గా ఫిక్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో బ్యూటీ జాక్వెలిన్‌ను ఫైనల్‌ చేసిన క్రిష్ టీం.. మరో హీరోయిన్‌గా రౌడీ జోడిని సెట్ చేస్తున్నారు.

పవన్‌ సినిమాలో నిధి అగర్వాల్ అన్న న్యూస్‌ ఈ మధ్య తెగ వైరల్ అయ్యింది. ఇప్పుడు నిధి కాదు.. అనన్య పాండే అనే అప్‌డేట్‌ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ ఫైటర్‌లో నటిస్తున్న అనన్య .. సౌత్‌ మేకర్స్‌ తెరకెక్కిస్తున్న మరో పాన్ ఇండియా ఫిలింకి సై అన్నారన్నది తాజా అప్‌డేట్. మొత్తానికి అటు రాజకీయాలు, ఇటు సినిమాలు..రెండిటిలోనూ పవనే హాట్ టాపిక్ అయ్యారు.

అమిత్ షా లైవ్ ప్రెస్ మీట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :