Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నుంచి రావడం తప్పా? కేసీఆర్ గల్లీలను మరిచారు కాబట్టే భయపడుతున్నారు.. అమిత్ షా సెటైర్లు

Venkata Narayana

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 30, 2020 | 5:45 PM

పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన దుబ్బాక ఫలితం తెలంగాణలో బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. దీంతో ప్రస్తుతం జరుగబోతోన్న..

గల్లీ ఎన్నికలకు ఢిల్లీ నుంచి రావడం తప్పా? కేసీఆర్ గల్లీలను మరిచారు కాబట్టే భయపడుతున్నారు.. అమిత్ షా సెటైర్లు

పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చిన దుబ్బాక ఫలితం తెలంగాణలో బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. దీంతో ప్రస్తుతం జరుగబోతోన్న జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ సీరియస్‌గా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే జాతీయ నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి ప్రచారం చేయిస్తోంది. వారితో ప్రచారం చేయిస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందులో భాగంగా బీజేపీ అగ్రనేత, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షా – ఇవాళ హైదరాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం అమిత్ షా మీడియాతో మాట్లాడుతున్నారు.. లైవ్ అప్డేట్స్ చూద్దాం..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Nov 2020 05:42 PM (IST)

    ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం.. అనంతరం సభ రేపటికి వాయిదా

    ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. చంద్రబాబు వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని పరిశీలనలోకి తీసుకుంటున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని, సభలో దురదృష్టకరమైన పరిణామం తానెప్పుడూ చూడలేదని స్పీకర్‌ అన్నారు. ప్రతిపక్ష నేత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని, రాజ్యాంగ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.

  • 29 Nov 2020 03:55 PM (IST)

    ఎంఐఎం అండతోనే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు: అమిత్ షా

    ఎంఐఎం అండతోనే హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు ఏర్పాటయ్యాయని, ఎంఐఎం మార్గదర్శనంలోనే టీఆర్ఎస్ నడుస్తోందని అమిత్ షా ఆరోపించారు. బీజేపీకి అవకాశమిస్తే.. హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులిస్తోందని చెప్పారు. తన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల తర్వాత వంద రోజుల ప్రణాళిక అన్నారు.. ఏమైంది? లక్ష ఇళ్లు కడతామన్నారు.. ఏమైంది? ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని ఆయన ప్రశ్నించారు. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేస్తాం.. పర్యాటక కేంద్రంగా మారుస్తాం అన్నారు. ఏమయ్యాయి అని అమిత్ షా అడిగారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావాలని కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.

  • 29 Nov 2020 03:49 PM (IST)

    కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ లో చేరకుండా పేదలకు అన్యాయం చేశారు : అమిత్ షా

    అంతపెద్దఎత్తున హైదరాబాద్ కు వరదలొస్తే, నగరంలో ముఖ్యమంత్రి పర్యటించలేదు.. వరదలప్పుడు సీఎం ఎవ్వరితోనూ సమావేశం కాలేదని అమిత్ షా ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆయుష్మాన్ భారత్ లో చేరి ఉంటే, పేదప్రజలకు ఐదు లక్షల ఖర్చుతో వైద్యం చేయించుకునే సౌలభ్యం కలిగి ఉండేదని అమిత్ షా చెప్పారు.

  • 29 Nov 2020 03:45 PM (IST)

    ఒక్కసారి గ్రేటర్ లో బీజేపీకి అధికారమిచ్చారంటే…

    టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లో కొత్త నల్లా కనెక్షన్లు 20 శాతం కూడా ఇవ్వలేదని అమిత్ షా విమర్శించారు. కేంద్రం కల్పించిన ఆయుష్మాన్ భారత్ లో చేరిఉంటే, పేదలకు మెరుగైన వైద్యం అందేదని ఆయన చెప్పారు. కేసీఆర్ సర్కారు ఆ పనిచేయలేదని విమర్శించారు. ఒక్కసారి బీజేపీకి గ్రేటర్ లో అధికారమిస్తే హైదరాబాద్ లో ఆక్రమణలు తొలగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.

  • 29 Nov 2020 03:38 PM (IST)

    మూసీనది వెంట ఆరులైన్ల రోడ్డు.. నగరంలో 15 డంపింగ్ యార్డులు : అమిత్ షా

    మేం చెప్పిందే చేస్తాం.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని అమిత్ షా అన్నారు. రోడ్ షో లో ఘన స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఎంఐఎం నేతృత్వంలోనే టీఆర్ఎస్ నడుస్తోందని అమిత్ షా ఆరోపించారు. హైదరాబాద్ లో సుపరిపాలన అందిస్తామన్నారు. వందరోజుల ప్రణాళిక గురించి ప్రజలు అడుగుతున్నారని చెప్పిన ఆయన, మీరు ఏంచేశారో హైదరాబాద్ ప్రజల ముందు పెట్టండని ఆయన టీఆర్ఎస్ సర్కారుని డిమాండ్ చేశారు. మూసీ వెంట ఆరులైన్ల రోడ్డు నిర్మించాల్సి ఉందని చెప్పారు. నగరంలో 15 డంపింగ్ యార్డులు నిర్మించాల్సి ఉందన్నారు.

  • 29 Nov 2020 03:31 PM (IST)

    ఈ ఆరేళ్లలో హైదరాబాద్ లో సకల సదుపాయాలున్న ఆస్పత్రుల నిర్మాణం జరుగలేదు

    ఒక్కఛాన్స్ ఇవ్వండి ప్రపంచస్థాయి ఐటీ హబ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని అమిత్ షా అన్నారు. ఈ ఆరేళ్లలో హైదరాబాద్ లో సకల సదుపాయాలున్న ఆస్పత్రుల నిర్మాణం జరుగలేదని ఆయన విమర్శించారు. మజ్లీస్ తో టీఆర్ఎస్ కు రహస్య పొత్తు ఎందుకని అమిత్ షా నిలదీశారు.

  • 29 Nov 2020 03:25 PM (IST)

    మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే ఐటీ హబ్ : అమిత్ షా

    ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో సీట్లు పెంచుకోవడమేకాదు, మేయర్ కూడా బీజేపీదే. సిటీలో నాలాల ఆక్రమణల వల్లే వరద దుస్థితి అని అమిత్ షా అన్నారు. మౌళిక సదుపాయాలు కల్పించినప్పుడే ఐటీ హబ్ ఏర్పడుతుంది.

  • 29 Nov 2020 03:15 PM (IST)

    భాగ్యనగరానికి వరదలు వస్తే ముఖ్యమంత్రి పర్యటించలేదు: అమిత్ షా

    హైదరాబాద్ కు అంతగా వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో పర్యటించలేదు. హైదరాబాద్ లో అమలు చేస్తున్న పదివేల కోట్ల ప్రణాళిక ఏమైంది అని అమిత్ షా ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం బీజేపీ దేనని షా అన్నారు.

Published On - Nov 29,2020 5:42 PM

Follow us