దిమ్మతిరిగే ఫర్మార్మెన్స్… టీమిండియాపై మరో రికార్డ్‌ నెలకొల్పిన ఆసిస్ టీమ్…

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ స్టేడియంలో రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసిస్ జట్టు టీమిండియాపై మరో రికార్డ్ నెలకొల్పింది.

దిమ్మతిరిగే ఫర్మార్మెన్స్... టీమిండియాపై మరో రికార్డ్‌ నెలకొల్పిన ఆసిస్ టీమ్...
Follow us

|

Updated on: Nov 29, 2020 | 3:42 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీ స్టేడియంలో రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసిస్ జట్టు టీమిండియాపై మరో రికార్డ్ నెలకొల్పింది. తొలి వన్డేలో నమోదు చేసిన రికార్డును చెరిపివేస్తూ తాజా రికార్డును నమోదు చేసింది. రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ టీమ్.. ఆట ఆరంభం నుంచే వీర బాదుడు బాదారు. ఆసిస్ టాప్ ఆర్డర్ అంతా 50కి పైగా పరుగులు చేసి అద్భుత ప్రదర్శనం కనబరచడంతో జట్టు స్కోర్ అమాంతం పెరిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 389/4 పరుగులు చేసిన కంగారూలు టీమిండియాపై తొలి వన్డేలో నెలకొల్పిన 374/6 రికార్డ్‌ను తిరగరాశారు. ఇప్పుడు ఈ స్కోర్ వన్డేల్లో భారత్‌పై కంగారూలు చేసిన అత్యధిక స్కోరుగా రికార్డులకెక్కింది.

కాగా, 2003 సంవత్సరంలో జోహన్నస్‌బర్గ్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు 359/2 పరుగులతో రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. వన్డేల్లో భారత్‌పై కంగారూలు చేసిన అత్యధిక స్కోరుగా అప్పుడది రికార్డులకెక్కింది. తాజాగా జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 374/6 పరుగులు చేసి నాటి రికార్డ్‌ను బద్దలు కొట్టింది. నేడు జరిగిన మ్యాచ్‌లో తాజా రికార్డ్‌ను సైతం చెరిపివేస్తూ కంగారూలు సరికొత్త రికార్డ్‌‌ను నెలకొల్పారు. ఇక మూడో వన్డేలో మరేం రికార్డ్ నెలకొల్పుతారో అంటూ టీమిండియా క్రికెట్ అభిమానులు నిట్టూరుస్తున్నారు.

సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచిన ఆసిస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 83 పరుగులు చేయగా, ఆరోన్ ఫించ్ 69 బంతుల్లో 60 పరుగులు చేసి ఆసిస్‌ జట్టుకు శుభారంభం అందించారు. ఇక స్టీవ్ స్మిత్ మరోసారి తన బ్యాట్‌ను ఝుళిపించాడు. 64 బంతుల్లో 14×4,2×6తో 104 పరుగులు చేసి దుమ్మురేపాడు. వీరితో పాటు లక్సెంబర్గ్ 61 బంతుల్లో 70 పరుగులు, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు స్కోరును భారీగా పెంచారు.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!