రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో క్రేజీ ఫీట్, భారత కెప్టెనా, మజాకా!
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో క్రేజీ ఫీట్ అందుకున్నాడు. దేశం తరఫున 250 వన్డేలు ఆడిన తొమ్మిదో ఫ్లేయర్‌గా నిలిచాడు.
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో క్రేజీ ఫీట్ అందుకున్నాడు. దేశం తరఫున 250 వన్డేలు ఆడిన తొమ్మిదో ఫ్లేయర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో పాల్గొని ఈ ఫీట్ అందుకున్నాడు కోహ్లీ. 2008 ఆగస్టు 18న శ్రీలంకతో మ్యాచ్‌తో వన్డేల్లో కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు. వీటితో పాటు 86 టెస్టులు, 82 టీ20లు భారత్ తరఫున ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 21 వేల పరుగులకు పైగా చేశాడు.
భారత్ తరఫున ఎక్కువ వన్డేలు ఆడిన వారిలో క్రికెట్ గాడ్ సచిన్(463) ముందున్నాడు. ఆ తర్వాత ధోనీ(347), రాహుల్ ద్రవిడ్(340), అజారుద్దీన్(334), సౌరభ్ గంగూలీ(308), యువరాజ్ సింగ్(301), అనిల్ కుంబ్లే(269) ఉన్నారు.
వరల్డ్ వైడ్‌గా చూస్తే.. సచిన్ టెండుల్కర్(463), మహేల జయవర్ధనే(448), సనత్ జయసూర్య(445), కుమార సంగక్కర(404), అఫ్రిది(398), ఇంజిమామ్ ఉల్ హక్(378), రికీ పాంటింగ్(375).. ఈ లిస్ట్‌లో ఉన్నారు.
అమిత్ షా హైదరాబాద్ పర్యటన లైవ్ అప్‌డేట్స్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :