‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ షూటింగ్ స్టార్ట్… పవన్‌తో నటిస్తున్నానని ప్రకటించిన రానా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రం మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రం మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టగా, దర్శకుడు త్రివిక్రమ్ కెమెరా ఆన్ చేసి షూటింగ్ కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ జనవరి 2021షురూ కానున్నాయి. సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ఎస్ సంగీతం అందిస్తున్నారు. తమన్ బీజీఎం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కిల్లర్ కాంబో అంటూ అటు పవన్, ఇటు రానా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
పవన్ తో పనిచేయడంపై రానా స్పందన…
రానా దగ్గుబాటి పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌తో కలిసి కొత్త మూవీని అనౌన్స్ చేశారు. మరో జర్నీ ప్రారంభం అంటూ రానా ట్వీట్ చేశారు. పరిశ్రమలో చాలా మంది స్టార్స్‌తో పనిచేయడం చాలా సంతోషం. ఇపుడిక అవర్ ఓన్ పవర్.. పవన్ కళ్యాణ్‌తో అంటూ రానా తన ఆనందాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఒక వీడియోను రానా ట్విటర్‌లో షేర్ చేశారు.
? @SitharaEnts Production No 12 ?️ Launched
Camera ? Switched On by #Trivikram Clap ? by @PawanKalyan Script ? handed over by S. Radha Krishna@RanaDaggubati @MusicThaman @saagar_chandrak @vamsi84
Regular Shoot ? From January pic.twitter.com/3oXllKICvF
— BARaju (@baraju_SuperHit) December 21, 2020
Another Journey begins!! What joy this is, been able work with so many stars across industries!! And now joining the coolest back home Our very own Power ⭐️ @PawanKalyan !! Can’t wait thank you @SitharaEnts!! https://t.co/rMgae4Bltj
— Rana Daggubati (@RanaDaggubati) December 21, 2020