AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ‘డబుల్ డిజిట్ క్రాస్’ చేస్తే ట్విటర్ వదిలేస్తా, ప్రశాంత్ కిషోర్ సవాల్, ‘సేవ్ దిస్ ట్వీట్’ అంటూ ప్రకటన

పశ్చిమ బెంగాల్ లో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 'డబుల్ డిజిట్' ను క్రాస్ చేస్తే ట్విటర్ నుంచి తను వైదొలగుతానని, దీన్ని వదిలేస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు.

బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 'డబుల్ డిజిట్ క్రాస్' చేస్తే ట్విటర్ వదిలేస్తా, ప్రశాంత్ కిషోర్ సవాల్, 'సేవ్ దిస్ ట్వీట్' అంటూ ప్రకటన
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 21, 2020 | 12:32 PM

Share

పశ్చిమ బెంగాల్ లో వచ్ఛే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ‘డబుల్ డిజిట్’ ను క్రాస్ చేస్తే ట్విటర్ నుంచి తను వైదొలగుతానని, దీన్ని వదిలేస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సవాల్ చేశారు. తన ఎనాలిసిస్ ఫెయిలయితే ఇదే చేస్తానని అన్న ఆయన..’సేవ్ దిస్ ట్వీట్. అని కూడా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం రెండంకెలకు మించదన్నారు. రాష్ట్రంలో హోం మంత్రి అమిత్ షా రాకతో మెల్లగా ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ప్రశాంత్ కిషోర్ నేరుగా బీజేపీపై తన అస్త్రాలను ఎక్కుపెట్టారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత సువెందు అధికారి సహా పలువురు బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన ఈ సవాల్ చేయడం విశేషం. మూడో సారి కూడా మమత ఎన్నికల్లో గెలిచేందుకు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ..ప్రశాంత్ కిషోర్ ని తమ ఎన్నికల వ్యూహకర్తగా నియమించారు. తృణమూల్ కాంగ్రెస్ రెబెల్స్ ఆట కట్టించేందుకు ఈయన ఏర్పాటు చేసిన ‘ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ’ రంగంలోకి దిగింది. ఈ కమిటీ ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆర్గనైజేషన్ ను, దీని ప్రభావాన్ని మదింపు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది వలంటీర్లను నియమించింది.ప్రశాంత్ కోశోర్ సూచనపై వీరంతా సిటింగ్ ఎమ్మెల్యేల ప్రస్తుత పాపులారిటీని, వారి సామర్త్యాన్ని బేరీజు వేస్తున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో తృణమూల్ తిరుగుబాటుదారుల  ప్రభావాన్ని అంచనా వేస్తూ సంబంధిత రిపోర్టులను ప్రశాంత్ కిషోర్ టీమ్ కి పంపుతున్నారు.

బెంగాల్ అసెంబ్లీ లోని 294 సీట్లకు వచ్ఛే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తృణమూల్ సభ్యులు 222 మంది ఉన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లను సాధించి పాలక పార్టీకి గట్టి ప్రతిపక్షంగా మారింది. హోమ్ మంత్రి అమిత్ షా రెండు రోజుల రాష్ట్ర పర్యటన ప్రభావాన్ని టీఎంసీఅంచనా వేస్తోంది.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?