మాయావతికి పాదాభివందనం చేసిన పవన్
విశాఖ: జనసేన, బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్ధుల గెలుపుకోసం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విశాఖపట్నం వచ్చారు. ఇక ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమె ప్రయాణించిన కారు డోరు తీసి.. కారు దిగగానే మాయావతి పాదాలకు మొక్కారు. ఇకపోతే మాయావతి రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. కాగా రేపు జరగబోయే ప్రెస్ మీట్ లో ఆమె పవన్ తో కలిసి పాల్గొంటారు. ఇక అదే […]

విశాఖ: జనసేన, బీఎస్పీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్ధుల గెలుపుకోసం బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విశాఖపట్నం వచ్చారు. ఇక ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమె ప్రయాణించిన కారు డోరు తీసి.. కారు దిగగానే మాయావతి పాదాలకు మొక్కారు.
ఇకపోతే మాయావతి రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. కాగా రేపు జరగబోయే ప్రెస్ మీట్ లో ఆమె పవన్ తో కలిసి పాల్గొంటారు. ఇక అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు. మరోవైపు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మాయావతి తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం ఐదుగంటలకు హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మాయావతి ప్రసంగిస్తారు.