AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ముకశ్మీర్‌లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన

జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ నెల 3 నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్‌ను (సవరణ) బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దుకు పదికిలోమీటర్ల పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుంది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మాజీ ప్రధాని నెహ్రూను మరోమారు టార్గెట్ చేశారు. కశ్మీర్ […]

జమ్ముకశ్మీర్‌లో మరో 6 నెలలు రాష్ట్రపతి పాలన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2019 | 10:14 PM

Share

జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు సోమవారం రాజ్యసభ ఆమోదించింది. ఈ నెల 3 నుంచి ఇది అమల్లోకి రానుంది. అలాగే, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్‌ను (సవరణ) బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దుకు పదికిలోమీటర్ల పరిధిలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుంది.

ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూ మాజీ ప్రధాని నెహ్రూను మరోమారు టార్గెట్ చేశారు. కశ్మీర్ సమస్యకు మూలకారకుడు ఆయనేనని విరుచుకుపడ్డారు. కశ్మీర్ రాజుతో ఒప్పందం తర్వాత కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అయిందన్నారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మోదీ సారథ్యంలోని ఎన్‌డీయే ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రజల మనసులు గెలుచుకునేందుకు ప్రణాళికలు రచిస్తోందని చెప్పారు. ఈ విషయంలో వాజ్‌పేయి అడుగుజాడల్లో నడుస్తామన్నారు.