బ్యాంకులకు ఆ అధికారం లేదు!
మొండి బకాయిలను బలవంతంగా వసూలు చేసేందుకు బౌన్సర్లను నియమించుకునే అధికారం బ్యాంకులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభకు తెలిపారు. ఒకవేళ రికవరీ ఏజెంట్లను నియమించుకోవాలంటే అందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పోలీసు వెరిఫికేషన్‌తోపాటు కొన్ని నియమనిబంధనలు పూర్తిచేసిన అనంతరమే రికవరీ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొండిబకాయిలను వసూలు చేసే క్రమంలో రుణదాతలను సమయం, సందర్భం లేకుండా వెళ్లి […]
మొండి బకాయిలను బలవంతంగా వసూలు చేసేందుకు బౌన్సర్లను నియమించుకునే అధికారం బ్యాంకులకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ లోక్‌సభకు తెలిపారు. ఒకవేళ రికవరీ ఏజెంట్లను నియమించుకోవాలంటే అందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. పోలీసు వెరిఫికేషన్‌తోపాటు కొన్ని నియమనిబంధనలు పూర్తిచేసిన అనంతరమే రికవరీ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మొండిబకాయిలను వసూలు చేసే క్రమంలో రుణదాతలను సమయం, సందర్భం లేకుండా వెళ్లి ఇబ్బంది పెట్టడం నేరమని వివరించారు. ‘‘రుణాలను బలవంతంగా వసూలు చేసేందుకు బౌన్సర్లను నియమించుకునే అధికారం ఏ బ్యాంకుకూ లేదు’’ అని మంత్రి స్పష్టంగా పేర్కొన్నారు.