లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్ రెడ్డి తాజాగా లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. కాగా రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌ రెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించిన విషయం తెలిసిందే.

  • Tv9 Telugu
  • Publish Date - 7:35 pm, Mon, 1 July 19