డ్రగ్స్‌తో పాక్ బోటు… పట్టుకున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్

పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటును భారత కోస్టల్ గార్డ్స్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇంటలిజెన్స్ మరియు డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన సమాచారంతో గుజరాత్ కోస్ట్ గార్డ్స్ ఇండో-పాక్ అంతర్జాతీయ సముద్ర జలాల తీర సరిహద్దులో రైడ్ చేశారు. ఈ క్రమంలో భారత జల భాగంలోకి వచ్చిన ఓ అనుమానిత బోట్ కదలికలను గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన చేపలు పట్టే ఆ బోటు ఆరుగురు సిబ్బందితో ఉంది. అయితే పూర్తిగా భారత్ జలాల్లోకి బోటు ప్రవేశించిండంతో అధికారులు వెంటనే […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:14 pm, Tue, 21 May 19
డ్రగ్స్‌తో పాక్ బోటు... పట్టుకున్న ఇండియన్ కోస్ట్‌గార్డ్

పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటును భారత కోస్టల్ గార్డ్స్ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇంటలిజెన్స్ మరియు డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన సమాచారంతో గుజరాత్ కోస్ట్ గార్డ్స్ ఇండో-పాక్ అంతర్జాతీయ సముద్ర జలాల తీర సరిహద్దులో రైడ్ చేశారు. ఈ క్రమంలో భారత జల భాగంలోకి వచ్చిన ఓ అనుమానిత బోట్ కదలికలను గుర్తించారు. పాకిస్థాన్‌కు చెందిన చేపలు పట్టే ఆ బోటు ఆరుగురు సిబ్బందితో ఉంది. అయితే పూర్తిగా భారత్ జలాల్లోకి బోటు ప్రవేశించిండంతో అధికారులు వెంటనే దానిని అడ్డుకుని.. తనిఖీలు చేపట్టగా అందులో 194లు హెరాయిన్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో బోటుతో సహా అందులో ఉన్నవారందరనీ.. భారత కోస్ట్‌గార్డ్ అదుపులోకి తీసుకుంది.