ఆయిల్ వ్యాపారంలో ఐఓసీని మించిన రిలయన్స్

రిలయన్స్ ఇండస్ట్రీస్… ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఆయిల్ వ్యాపారంలో భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను మించిపోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ టర్నోవర్ రూ.6.23 లక్షల కోట్లు కాగా, ఐఓసీ టర్నోవర్ రూ.6.17 లక్షల కోట్లు అని రెండు కంపెనీలు రెగ్యులేటరీకి ఫైల్ చేసిన నివేదికల్లో తేలింది. టర్నోవర్‌లో ఐఓసీని దాటిన రిలయన్స్ లాభాల్లో మరింత దూకుడు చూపించింది. ఐఓసీ అందుకోలేనంత స్థాయిలో రిలయన్స్ లాభాలున్నాయి. దేశంలోనే […]

ఆయిల్ వ్యాపారంలో ఐఓసీని మించిన రిలయన్స్
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 6:49 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్… ఆయిల్ నుంచి టెలికాం వరకు అనేక రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించింది. ఆయిల్ వ్యాపారంలో భారత ప్రభుత్వానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను మించిపోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ టర్నోవర్ రూ.6.23 లక్షల కోట్లు కాగా, ఐఓసీ టర్నోవర్ రూ.6.17 లక్షల కోట్లు అని రెండు కంపెనీలు రెగ్యులేటరీకి ఫైల్ చేసిన నివేదికల్లో తేలింది. టర్నోవర్‌లో ఐఓసీని దాటిన రిలయన్స్ లాభాల్లో మరింత దూకుడు చూపించింది. ఐఓసీ అందుకోలేనంత స్థాయిలో రిలయన్స్ లాభాలున్నాయి. దేశంలోనే అత్యంత లాభదాయక కంపెనీగా రిలయన్స్ రికార్డులు సృష్టిస్తోంది. టెలికామ్, రీటైల్, డిజిటల్ సర్వీసెస్‌లో వ్యాపారాలను విస్తరించిన రిలయన్స్ నికర లాభం రూ.39,588 కోట్లు కాగా, ఐఓసీ నికర లాభం రూ.17.274 కోట్లు.

అంతకుముందు సంవత్సరం వరకు లాభదాయక ప్రభుత్వ రంగ సంస్థగా పేరున్న ఐఓసీ ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ఆస్థానాన్ని ఆక్రమించింది. మంగళవారం రిలయెన్స్ షేర్ ధర రూ.1,345 కాగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.52 లక్షల కోట్లు.