పాకిస్థాన్‌లో చైనా వ్యాక్సిన్ స్టేజ్-3 ట్ర‌య‌ల్స్‌

చైనా కోవిడ్-19 వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ పాకిస్థాన్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు ఆ దేశ‌ డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

పాకిస్థాన్‌లో చైనా వ్యాక్సిన్ స్టేజ్-3 ట్ర‌య‌ల్స్‌
Follow us

|

Updated on: Aug 19, 2020 | 6:32 PM

చైనా కోవిడ్-19 వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్ర‌య‌ల్స్ పాకిస్థాన్‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇందుకు ఆ దేశ‌ డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ చైనా యొక్క కాన్సినో బయోలాజిక్స్ (కాన్సినో), బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నాయి. ఈ ట్ర‌య‌ల్స్ వచ్చే నెలలో ప్రారంభం కానున్న‌ట్లు సంబంధింత‌ అధికారి తెలిపారు. ప్రారంభ, మధ్య దశల ట్రయల్స్ తర్వాత చైనా తన సైనిక ఉపయోగం కోసం ఇప్పటికే ఈ టీకాను ఆమోదించింది. చివరి దశ ట్రయల్స్ మెక్సికో, సౌదీ అరేబియాలో జ‌ర‌గ‌నున్నాయి. సౌదీ అరేబియా, రష్యా, బ్రెజిల్, చిలీలలో ఫేజ్ 3 ట్రయల్స్ ప్రారంభించే అవకాశాల కోసం చర్చలు జరుపుతున్నట్లు కాన్సినో గత నెలలో తెలిపింది.

పాకిస్తాన్ యొక్క డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ దేశీయంగా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ కూడా ప‌చ్చ జెండా ఊపింది. కరాచీలోని సింధు హాస్పిటల్ ఇవి జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ పరీక్షలను కరాచీలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కెమికల్ అండ్ బయోలాజికల్ సైన్సెస్ ఒక చైనా సంస్థ సహకారంతో నిర్వహిస్తుంది. సుమారు 2 నెలల్లో పూర్తయ్యే ట్రయల్స్ కోసం 200 మంది వాలంటీర్లను నమోదు చేసుకున్నారు.