AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుష్మా.. జైట్లీ.. నెక్స్ట్ మోదీనే… బ్రిటిష్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!

ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి పాకిస్థాన్.. భారత్‌పై ఏదో ఒక రకంగా మాటల దాడికి పాల్పడుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి.. పాకిస్థాన్ కేంద్రమంత్రుల వరకు అందరూ కూడా నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టినవారే. ఇక తాజాగా పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధాని మోదీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నజీర్ అహ్మద్ […]

సుష్మా.. జైట్లీ.. నెక్స్ట్ మోదీనే... బ్రిటిష్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
Ravi Kiran
| Edited By: |

Updated on: Aug 28, 2019 | 10:49 AM

Share

ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి పాకిస్థాన్.. భారత్‌పై ఏదో ఒక రకంగా మాటల దాడికి పాల్పడుతోంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నుంచి.. పాకిస్థాన్ కేంద్రమంత్రుల వరకు అందరూ కూడా నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టినవారే. ఇక తాజాగా పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీ నజీర్ అహ్మద్ ప్రధాని మోదీపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ సీనియర్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నజీర్ అహ్మద్ చేసిన ట్వీట్ దుమారం లేపింది. జైట్లీ తర్వాత టార్గెట్ ప్రధాని మోదీనే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక దీనిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. కాంగ్రెస్ లీడర్ మిలింద్ డియోరా.. నజీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అప్పటికే ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడం.. దానిపై నెటిజన్లు కూడా దుమ్మెత్తిపోశారు.

Claims of sorcery, Jadoo , magic, witchcraft, on @BJP4India by opposition Jaitley, Gaur former CM of Madhya Pradesh, Shushma Swaraj , Atal Vajpayee , Manohar Parrikar CM Goa and Arun Jaitley … have all died in the last one year hey @narendramodi is next https://t.co/Kqfco5RXk9

— Lord Nazir Ahmed (@nazir_lord) August 26, 2019

బీజేపీ పార్టీపై ప్రతిపక్ష పార్టీ ఏదో జాదూ చేసిందని.. చేతబడి, వశీకరణ విద్యను కూడా ప్రదర్శిస్తోంది. అందుకే బీజేపీ దిగ్గజాలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, మనోహర్ పారికర్ లాంటి వాళ్ళు ఒక సంవత్సరం వ్యవధిలోనే మృతి చెందారు. నెక్స్ట్ టార్గెట్ మోదీనే అంటూ నజీర్ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్‌పై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. హౌస్ అఫ్ లార్డ్స్‌లోకి నీలాంటి వ్యక్తి ఎలా ప్రవేశించాడో అర్ధం కావట్లేదు. మేనేజ్ చేసి ఎంపీగా గెలిచావా.? అంటూ తీవ్రంగా విమర్శించారు.

మరోవైపు నజీర్ అహ్మద్‌కు ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు కూడా కాంట్రవర్సీ ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇక నజీర్ గతంలోకి వెళ్తే.. 1970లో ఇద్దరు మైనర్లపై నజీర్ అత్యాచారయత్నం చేసినట్లు రుజువైంది. అత్యాచారం చేసిన వ్యక్తుల స్వభావం ఇలానే చీప్‌గా ఉంటుందంటూ నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

ఇది ఇలా ఉండగా బీజేపీ ఎంపీ సాద్వీ ప్రగ్యా ఠాకూర్ కూడా ప్రతిపక్షాలు బీజేపీపై వశీకరణ చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు
పెళ్లైన 24 గంటలకే విడాకులు.. భర్త చెప్పిన సీక్రెట్‌తో షాకైన వధువు