కాశ్మీర్లో రక్తపాతం.. పాకిస్తాన్ భారీ పన్నాగం ! ఇంటెలిజెన్స్ వార్నింగ్ !

కాశ్మీర్లో రక్తపాతం.. పాకిస్తాన్ భారీ పన్నాగం ! ఇంటెలిజెన్స్ వార్నింగ్ !

జమ్మూకాశ్మీర్ కు సంబంధించి 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేయడంతో పాకిస్తాన్ భగ్గుమంటోంది. కాశ్మీర్లో రక్తపుటేరులు పారించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ పొడవునా 100 మందికి పైగా స్పెషల్ సర్వీసు కమాండోలను నియమించింది. తరచూ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు జరగడానికి ఇదే కారణమని అంటున్నారు. ఈ కమెండోలతో బాటు 100 మంది ఉగ్రవాదులను కూడా కాశ్మీర్లో దొంగచాటుగా ప్రవేశపెట్టేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాశ్మీర్లో ప్రభుత్వం దశల […]

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Aug 28, 2019 | 1:24 PM

జమ్మూకాశ్మీర్ కు సంబంధించి 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేయడంతో పాకిస్తాన్ భగ్గుమంటోంది. కాశ్మీర్లో రక్తపుటేరులు పారించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ పొడవునా 100 మందికి పైగా స్పెషల్ సర్వీసు కమాండోలను నియమించింది. తరచూ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు జరగడానికి ఇదే కారణమని అంటున్నారు. ఈ కమెండోలతో బాటు 100 మంది ఉగ్రవాదులను కూడా కాశ్మీర్లో దొంగచాటుగా ప్రవేశపెట్టేందుకు ఆ దేశం కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాశ్మీర్లో ప్రభుత్వం దశల వారీగా నిషేధాజ్ఞలను ఎత్తివేస్తుండడం కూడా పాక్ కు కలిసొస్తోంది. ఎలాగైనా ఆ రాష్ట్రంలో రక్తపాతాన్ని సృష్టించాలి.. భీతావహ పరిస్థితిని కల్పించాలి.. అన్నదే పాక్ వ్యూహంగా కనబడుతోందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ పొడవునా పాక్ భూభాగంలో సుమారు 15 మంది జైషే మహమ్మద్ టెర్రరిస్టులు తమ ‘ సుప్రీం కమాండర్ల ‘ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారట. ఏ క్షణమైనా వారు ఈ రాష్ట్రంలో చొరబడవచ్ఛునని సంకేతాలు అందుతున్నాయని ఈ వర్గాలు తెలిపాయి. రానున్న కొన్ని వారాల్లో ఉగ్రవాద బృందాలు దేశంలోని ప్రధాన నగరాల్లో గల ముఖ్య కేంద్రాలపై దాడులు చేసే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారు 100 మంది టెర్రరిస్టులను కాశ్మీర్ సరిహద్దుల్లో దింపవచ్చునని.. వీరి దాడులతో కాశ్మీర్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందనే విషయాన్ని అంతర్జాతీయ దేశాల దృష్టికి తేవాలని పాక్ యోచిస్తోందని తెలిసింది. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్ సోదరుడు ముప్తీ రవూఫ్ అస్గర్ ఈ నెల 19, 20 తేదీల్లో బహావల్పూర్ హెడ్ క్వార్టర్స్ లో టాప్ కమాండర్లతో సమావేశాలు నిర్వహించాడని, కాశ్మీర్లోకి కరడు గట్టిన టెర్రరిస్టులను ఎలా జొప్పించాలన్న విషయంపై ఈ సమావేశాల్లో చర్చించాడని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. పైగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఇటీవలి కాలంలో రెచ్చ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. పుల్వామా దాడి వంటి దాడులు జరగవచ్చునని హెచ్చరిస్తున్నాడు.

కాశ్మీర్లోని ‘ లోకల్ టెర్రరిస్టులకు ‘ తగిన శిక్షణ లేదని, సరైన నాయకత్వ లేమితో ‘ సతమతమవుతున్నారని ‘ పాక్ అంచనా వేస్తోందట. అందువల్లే ‘ సుశిక్షితులైన ‘ ఉగ్రవాదులను పంపాలని యోచిస్తోంది. ఇండియాకు వ్యతిరేక ప్రచారం నిర్వహించేందుకు పాకిస్తాన్ విదేశాల్లోని తన రహస్య కేంద్రాల్లో ప్రత్యేకంగా ‘ కాశ్మీర్ డెస్క్ ‘ లను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇలా ఇంటెలిజెన్స్ అధికారులు షాకింగ్ వాస్తవాలను వెల్లడించడంతో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu