ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్.. పాక్ ప్రధాని ఇమ్రాన్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ వైఖరి ఎన్నిరకాలుగా మారిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై భారత్‌తో మాట్లాడేది లేదంటూ తేల్చి చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. న్యూయార్క్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి స్ధాపనకోసం తాము ఎంతగా ప్రయత్నించినా భారత్ ముందుకు రాలేదని, ఇకపై భారత్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవంటూ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇరు దేశాల మిలిటరీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందన్నారు. ఇదిలా […]

ఇక మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్.. పాక్ ప్రధాని ఇమ్రాన్
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2019 | 3:02 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ వైఖరి ఎన్నిరకాలుగా మారిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై భారత్‌తో మాట్లాడేది లేదంటూ తేల్చి చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. న్యూయార్క్ టైమ్స్ మేగజైన్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతి స్ధాపనకోసం తాము ఎంతగా ప్రయత్నించినా భారత్ ముందుకు రాలేదని, ఇకపై భారత్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవంటూ వ్యాఖ్యానించారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఇరు దేశాల మిలిటరీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుందన్నారు.

ఇదిలా ఉంటే అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ పాక్ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత్ శాంతిస్ధాపన కోసం చేసిన ప్రతి ప్రయత్నంలోనూ ఉగ్రవాదుల రూపంలో పాక్ వ్యవహరించిన తీరుతో భారత్ చెడు మాత్రమే ఎదుర్కొందని పేర్కొన్నారు. ముందు ఉగ్రవాదం నిర్మూలన విషయంలో పాక్ విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలన్నారు హర్షవర్ధన్.

అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలని పాక్ చేసిన ప్రతి ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఇలా విమర్శలు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో పాక్‌ ఇప్పటికే పలు దేశాల సాయాన్ని కోరింది. అయితే ఇది పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని ఆ దేశాలు వెనకడుగు వేయడంతో పాకిస్తాన్ ప్రధాని ఈ విధమైన వ్యాఖ్యలకు తెరతీశారు.