ఇంతకీ మీరు ఏ పార్టీ ?.. సుజనాకు మంత్రి అవంతి సూటిప్రశ్న
ఏపీ రాజధాని తరలింపు అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ కూడా రాజధాని అమరావతిపై మాట్లాడుతోంది. ఇదే విషయంపై ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. సుజనా చౌదరి టీడీపీ వైపు మాట్లాడుతున్నారా? లేక బీజేపీ వైపు నుంచి మాట్లాడుతున్నారా అంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్చితే విప్లవం వస్తుందన్న సుజనా వ్యాఖ్యలనుద్దేశించి.. రాష్ట్రానికి రావాల్సిన వరద సాయం […]
ఏపీ రాజధాని తరలింపు అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ కూడా రాజధాని అమరావతిపై మాట్లాడుతోంది. ఇదే విషయంపై ఆపార్టీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. సుజనా చౌదరి టీడీపీ వైపు మాట్లాడుతున్నారా? లేక బీజేపీ వైపు నుంచి మాట్లాడుతున్నారా అంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్చితే విప్లవం వస్తుందన్న సుజనా వ్యాఖ్యలనుద్దేశించి.. రాష్ట్రానికి రావాల్సిన వరద సాయం అందకపోతే నిజంగా విప్లవమే వస్తుందన్నారు.
ఇక విశాఖలో గత ఐదేళ్లలో జరిగిన భూ కబ్జాలన్నీ వెలికితీస్తున్నామని, ఇలాంటి కబ్జాలకు పాల్పడ్డ వారు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారని అవంతి హెచ్చిరించారు. పారదర్శకమైన పాలన అందించడానికి సీఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు.