హైదరాబాద్ అల్లుడికి చుక్కెదురు.. జట్టులో దక్కని చోటు
న్యూజిలాండ్ పర్యటన కోసం 35 మందితో కూడిన పాకిస్థాన్ జట్టును పీసీబీ ప్రకటించింది. అందులో ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, పేసర్ మహమ్మద్ అమీర్‌లకు స్థానం దక్కలేదు. యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారిని....
న్యూజిలాండ్ పర్యటన కోసం 35 మందితో కూడిన పాకిస్థాన్ జట్టును పీసీబీ ప్రకటించింది. అందులో ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, పేసర్ మహమ్మద్ అమీర్‌లకు స్థానం దక్కలేదు. యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారిని సెలెక్ట్ చేయలేదని పీసీబీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్-పాకిస్థాన్ మధ్య వచ్చే నెలలో టెస్టు సిరీస్ జరగనుంది. దాని కంటే ముందుగా డిసెంబరు 18, 20, 22 తేదీల్లో ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
నవంబరు 23న కివీస్ పర్యటనకు పాక్ జట్టు బయలుదేరనుంది. పాకిస్థాన్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాబర్ అజామ్‌ను మంగళవారం పీసీబీ నియమించగా.. వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్‌ను ఎంపిక చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయో-బబుల్‌ను ఏర్పాటు చేసి కివీస్, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించనున్నారు.