కుల్‌భూషణ్‌కు రాయబార అనుమతి… పాక్ కీలక నిర్ణయం!
పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు రాయబార అనుమతి (కాన్సులర్ యాక్సెస్) కల్పించేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం ఆ అవకాశం కల్పిస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పేరా 1(బీ) ప్రకారం కుల్‌భూషణ్‌కు కాన్సులర్ అనుమతి జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ సైన్యం కుల్‌భూషణ్ […]

పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత నౌకాదళ విశ్రాంత అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు రాయబార అనుమతి (కాన్సులర్ యాక్సెస్) కల్పించేందుకు పాకిస్థాన్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం ఆ అవకాశం కల్పిస్తామని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఆదివారం ట్విటర్ ద్వారా ప్రకటించింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పేరా 1(బీ) ప్రకారం కుల్‌భూషణ్‌కు కాన్సులర్ అనుమతి జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది.
గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ సైన్యం కుల్‌భూషణ్ జాదవ్‌ను 2017లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడికి మరణ శిక్ష విధిస్తామని కూడా ప్రకటించింది. దీనిపై భారత్ హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)ను ఆశ్రయించడంతో పాకిస్థాన్ మిలటరీ కోర్టు విధించిన మరణ శిక్షను ఐసీజే నిలిపివేసింది. ఈ సందర్భంగా కుల్‌భూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూషణ్ జాదవ్‌కు కాన్సులర్ అనుమతి పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. తక్షణం కుల్‌భూషణ్‌కు రాయబార అనుమతులు ఇవ్వాలని పాక్‌కు ఐసీజే గత జులైలో ఆదేశాలు జారీ చేసింది.