చంద్రయాన్‌-2: ఆఖరి కక్ష్య కుదించిన ఇస్రో!

అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కొత్త చరిత్రను సృష్టించేందుకు సమయం అంతకంతకూ దగ్గరపడుతోంది. గగనతల పరిశోధనలో కొత్త రికార్డును నెలకొల్పే దిశగా చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రడిపైపు  విజయవంతంగా ప్రయాణం చేస్తోంది.  జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలసిందే. తాజాగా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-2కు ఐదో ఆఖరి కక్ష్య కుదింపు ప్రక్రియను […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:00 pm, Sun, 1 September 19
చంద్రయాన్‌-2: ఆఖరి కక్ష్య కుదించిన ఇస్రో!
Final lunar orbit reducing maneuver of Chandrayann-2

అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ కొత్త చరిత్రను సృష్టించేందుకు సమయం అంతకంతకూ దగ్గరపడుతోంది. గగనతల పరిశోధనలో కొత్త రికార్డును నెలకొల్పే దిశగా చంద్రయాన్ 2 ఉపగ్రహం చంద్రడిపైపు  విజయవంతంగా ప్రయాణం చేస్తోంది.  జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 2 ఉపగ్రహం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలసిందే. తాజాగా చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-2కు ఐదో ఆఖరి కక్ష్య కుదింపు ప్రక్రియను ఆదివారం చేపట్టారు. ముందస్తు ప్లానింగ్ ప్రకారం సాయంత్రం 6.21 గంటల సమయంలో ఆన్‌బోర్డ్‌ ప్రొపల్షన్‌ వ్యవస్థ ద్వారా 52 సెకన్లపాటు ఈ విన్యాసాన్ని చేపట్టినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం చంద్రయాన్‌-2 నౌక చంద్రుడి చుట్టూ 119X127 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తోందని, వ్యవస్థ పనితీరు సాధారణంగానే ఉందని ప్రకటించింది.

చంద్రయాన్‌-2 కక్ష్య నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ను వేరు చేయడం ఈ ప్రయోగంలో తర్వాతి విన్యాసమని, దీన్ని సెప్టెంబరు 2న మధ్యాహ్నం 12.45 నుంచి 13.45 సమయంలో చేపట్టనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి. దీని తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేందుకు వీలుగా ల్యాండర్‌ విక్రమ్‌కు రెండు డీ ఆర్బిట్‌ విన్యాసాలు చేపడతారు. సెప్టెంబరు 3న మొదటి విన్యాసం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య, 4న రెండో డీ ఆర్బిట్‌ విన్యాసం ఉదయం 3 నుంచి 4 గంటల మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో ప్రణాళిక వేసింది.