కశ్మీర్‌లో 400 మందికి భద్రత పునరుద్ధరణ
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో 400 మంది రాజకీయ నాయకులకు భద్రతను పునరుద్ధరించారు. రాజకీయ నాయకులకు భద్రతను పునరుద్ధరిస్తున్నట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉత్తర్వులు జారీ చేశారు. పుల్వామా ఘటన తరువాత కాశ్మీర్ వేర్పాటువాదులతో సహా అనేకమందికి భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల వేళ ఉగ్రవాదుల ప్రాబల్యమున్న కశ్మీర్‌లో రాజకీయ నాయకుల భద్రతను తొలగించడంపై అక్కడి నేతలు మండిపడ్డారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. […]
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో 400 మంది రాజకీయ నాయకులకు భద్రతను పునరుద్ధరించారు. రాజకీయ నాయకులకు భద్రతను పునరుద్ధరిస్తున్నట్లు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఉత్తర్వులు జారీ చేశారు. పుల్వామా ఘటన తరువాత కాశ్మీర్ వేర్పాటువాదులతో సహా అనేకమందికి భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికల వేళ ఉగ్రవాదుల ప్రాబల్యమున్న కశ్మీర్‌లో రాజకీయ నాయకుల భద్రతను తొలగించడంపై అక్కడి నేతలు మండిపడ్డారు. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ఈసీ జోక్యం చేసుకోవడంతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆయా పార్టీ నేతలకు భద్రతను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.