“సమ్మె” బాట పడుతున్న జెట్‌ పైలట్లు

న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కొట్టుమిట్టాతున్న జెట్ ఎయిర్ వేస్‌కు మరో షాక్ తగలనుంది. వేతనాలు ఇవ్వకపోవడంతో జెట్ పైలట్లు సమ్మె బాట ఎంచుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విమానాలు నడిపేది లేదని 1000 మందికి పైగా పైలట్లు స్పష్టం చేశారు. జీతాలపై కంపెనీ ఇంతవరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ వెల్లడించింది. మార్చి 29 కల్లా ఎస్‌బీఐ నుంచి తాత్కాలిక నిధులు వస్తాయని భావించాం.. […]

సమ్మె బాట పడుతున్న జెట్‌ పైలట్లు
Follow us

| Edited By:

Updated on: Mar 30, 2019 | 7:03 PM

న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కొట్టుమిట్టాతున్న జెట్ ఎయిర్ వేస్‌కు మరో షాక్ తగలనుంది. వేతనాలు ఇవ్వకపోవడంతో జెట్ పైలట్లు సమ్మె బాట ఎంచుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి విమానాలు నడిపేది లేదని 1000 మందికి పైగా పైలట్లు స్పష్టం చేశారు. జీతాలపై కంపెనీ ఇంతవరకూ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పైలట్ల సంఘం నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ వెల్లడించింది. మార్చి 29 కల్లా ఎస్‌బీఐ నుంచి తాత్కాలిక నిధులు వస్తాయని భావించాం.. కానీ దురదృష్టవశాత్తు నిధుల బదిలీ జరగలేదు. అంతేగాక.. పైలట్ల జీతాల చెల్లింపులపై యాజామాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి విమానాలు నడపబోమని మేం నిర్ణయం తీసుకున్నామని ఎన్‌ఏజీ అధ్యక్షుడు కరణ్‌ చోప్రా తెలిపారు.

అప్పులతో సంక్షోభంలో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌ గత నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు అందించకపోవడంతో.. జీతాలు లేక జెట్‌ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడు యాజమాన్యం మారినా.. వేతనాలపై స్పష్టత లేకపోవడంతో జెట్‌ పైలట్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 31లోగా వేతనాలు చెల్లించపోతే ఏప్రిల్‌ 1 నుంచి విధులను బహిష్కరిస్తామని గతంలోనే హెచ్చరించారు. తాజాగా జెట్‌కు బ్యాంక్‌ నుంచి ఎలాంటి నిధులు రాకపోవడంతో సోమవారం నుంచి విమానాలు నడపబోమని స్పష్టం చేశారు.

ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?