కరోనా ఎఫెక్ట్.. ఓపో ఫ్యాక్టరీ మూసివేత.. 3 వేలమందికి టెస్టులు

ఢిల్లీ సమీపంలోని మొబైల్ ఫోన్ కంపెనీ.. 'ఓపో' ఫ్యాక్టరీని మూసివేశారు. ఈ ఫ్యాక్టరీలో పని చేసే ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకినట్టు వెల్లడైంది. దీంతో ఇందులోని సుమారు 3 వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు...

కరోనా ఎఫెక్ట్.. ఓపో ఫ్యాక్టరీ మూసివేత.. 3 వేలమందికి టెస్టులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: May 18, 2020 | 1:53 PM

ఢిల్లీ సమీపంలోని మొబైల్ ఫోన్ కంపెనీ.. ‘ఓపో’ ఫ్యాక్టరీని మూసివేశారు. ఈ ఫ్యాక్టరీలో పని చేసే ఆరుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకినట్టు వెల్లడైంది. దీంతో ఇందులోని సుమారు 3 వేల మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. వారి టెస్టు ఫలితాలు రావలసి ఉందని పేర్కొంది. తమ ఉద్యోగుల భద్రత, రక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ముందు జాగ్రత్త చర్యగా తమ సంస్థను మూసివేశామని దీని యజమానులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ ఆదేశాలతో ఈ నెలారంభంలో మళ్ళీ తమ కార్యకలాపాలు ప్రారంభించిన ఫ్యాక్టరీల్లో ఓపో కూడా ఒకటి. ఇదిలా ఉండగా ఢిల్లీలో గత 24 గంటల్లో 299  కరోనా కేసులు నమోదయ్యాయి. 283 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,485 కి పెరిగింది. కరోనా కేసుల మొత్తం సంఖ్య 10,054  అని అధికారవర్గాలు పేర్కొన్నాయి.