AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమీర్‌పేటలో ఘోర రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన బైక్.. మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుని యువకుడి మృతి

హైదరాబాద్ మహానగరంలోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన బైక్ మెట్రో స్టేషన్‌ రైలింగ్‌కు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.

అమీర్‌పేటలో ఘోర రోడ్డుప్రమాదం.. అదుపుతప్పిన బైక్.. మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుని యువకుడి మృతి
Balaraju Goud
|

Updated on: Dec 11, 2020 | 10:08 AM

Share

హైదరాబాద్ మహానగరంలోని అమీర్‌పేట చౌరస్తాలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన బైక్ మెట్రో స్టేషన్‌ రైలింగ్‌కు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఖైరతాబాద్ వైపు నుంచి ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై అతి వేగంతో కూకట్‌పల్లి వైపు బయల్దేరారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో ఇద్దరు యువకులు మెట్రో స్టేషన్‌ రైలింగ్‌ను ఢీకొన్నారు. ఈఘటనలో యువకుడి తల మెట్రో స్టేషన్‌ రైలింగ్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ యువకుడిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు