మంచు దుప్పటి… రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు… పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులూ శీతల వాతావరణం…

ఉత్తర భారత దేశాన్ని పొగమంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వేళలో దట్టమైన మంచు పడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మంచు దుప్పటి... రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు... పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరో రెండు రోజులూ శీతల వాతావరణం...
Follow us

| Edited By:

Updated on: Dec 11, 2020 | 10:06 AM

ఉత్తర భారత దేశాన్ని పొగమంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం వేళలో దట్టమైన మంచు పడుతుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా తూర్పు యూపీ, బిహార్ రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. బీహార్ రాజధాని పాట్నాలో 15 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది.

అంతేకాకుండా వారణాసిలో దట్టమైన మంచుపడుతోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో వాతావరణం ఇలానే చల్లగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. కాగా పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు.