బెంగుళూరులో బ్లాస్ట్.. ఎమ్మెల్యే టార్గెట్..?
గార్డెన్ సిటీ బెంగుళూరు ఈ ఉదయం బాంబు పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పేలుడు తీవ్రతకు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా ప్రాంతంలోని ఇళ్ళు, వాహనాలు దెబ్బతిన్నాయి. బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న ఇంటి సమీపంలో ఈ పేలుడు జరిగింది. చనిపోయిన వ్యక్తి స్థానికంగా ఉండే ధోబీ వెంకటేశ్‌గా గుర్తించారు. పేలుడు సమయంలో వెంకటేష్ అటువైపుగా వెళ్తుండగా పేలుడు జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న నగర పోలీస్ […]

గార్డెన్ సిటీ బెంగుళూరు ఈ ఉదయం బాంబు పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. పేలుడు తీవ్రతకు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా ప్రాంతంలోని ఇళ్ళు, వాహనాలు దెబ్బతిన్నాయి. బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే మునిరత్న ఇంటి సమీపంలో ఈ పేలుడు జరిగింది. చనిపోయిన వ్యక్తి స్థానికంగా ఉండే ధోబీ వెంకటేశ్‌గా గుర్తించారు. పేలుడు సమయంలో వెంకటేష్ అటువైపుగా వెళ్తుండగా పేలుడు జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న నగర పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ స్పాట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పేలుడుకు కారణాలు తెలుసుకునేందుకు క్లూస్ టీంలను రంగంలోకి ది దించామని సీపీ తెలిపారు.



