కేన్స్‌లో మెరిసిన భారతీయ మహిళా రైతు

పారిస్‌: అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేదికపై మన భారతీయ మహిళా రైతుపై తీసిన డాక్యుమెంటరీ ఫిలిం సత్తా చాటింది. ఈ ఏడాది కేన్స్‌లో ప్రదర్శించేందుకు మన భారతీయ చిత్రాలేవీ ఎంపిక కాకపోయినా… ప్రముఖ దర్శకుడు అచ్యుతానంద ద్వివేది తెరకెక్కించిన ‘సీడ్‌ మదర్’ షార్ట్ ఫిల్మ్‌ను కేన్స్‌లో ప్రదర్శించారు. కేవలం మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి నెస్‌ప్రెసో టాలెంట్స్‌ కేటగిరీలో మూడో ప్రైజ్‌ లభించింది. ఓ భారతీయ మహిళా రైతు నేపథ్యంలో తీసిన షార్ట్ […]

కేన్స్‌లో మెరిసిన భారతీయ మహిళా రైతు
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 5:02 PM

పారిస్‌: అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేదికపై మన భారతీయ మహిళా రైతుపై తీసిన డాక్యుమెంటరీ ఫిలిం సత్తా చాటింది. ఈ ఏడాది కేన్స్‌లో ప్రదర్శించేందుకు మన భారతీయ చిత్రాలేవీ ఎంపిక కాకపోయినా… ప్రముఖ దర్శకుడు అచ్యుతానంద ద్వివేది తెరకెక్కించిన ‘సీడ్‌ మదర్’ షార్ట్ ఫిల్మ్‌ను కేన్స్‌లో ప్రదర్శించారు. కేవలం మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి నెస్‌ప్రెసో టాలెంట్స్‌ కేటగిరీలో మూడో ప్రైజ్‌ లభించింది.

ఓ భారతీయ మహిళా రైతు నేపథ్యంలో తీసిన షార్ట్ ఫిల్మ్‌కి ఇంతటి ఆదరణ వచ్చిందంటే గొప్ప విషయమనే చెప్పాలి. అదీకాకుండా ఈ ఏడాది కేన్స్‌ థీమ్‌ ‘వుయ్‌ ఆర్ వాట్‌ వుయ్‌ ఈట్‌’. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార పదార్థాలు, వాటిని పండించే ప్రక్రియల నేపథ్యంలో తీసే సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఏడాది 47 దేశాల నుంచి 371 వీడియోలు కేన్స్‌కు వెళ్లాయి. వాటిలో ‘సీడ్‌ మదర్‌’ ఒకటి.

మహారాష్ట్రకు చెందిన 55 ఏళ్ల రహీబాయి సోమా అనే మహిళా రైతు జీవితం నేపథ్యంలో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించారు. ఈ  మహిళ తమ ప్రాంతంలో లభించే విత్తనాలతో, పురాతన వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తూ వస్తోంది. బీబీసీ టాప్‌ 100 ఇన్‌స్పైరబుల్ మహిళల్లో ఆమె మూడో స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి కూడా అవార్డును అందుకున్నారు.