రెండు వర్గాల మధ్య రాళ్లు, కట్టెలతో పరప్పర దాడులు.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతూ ఒకరు మృతి

ఒకే పార్టీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. కడప జిల్లా కొండాపురం మండలంలోని పి.అనంతపురంలో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:27 pm, Fri, 13 November 20
రెండు వర్గాల మధ్య రాళ్లు, కట్టెలతో పరప్పర దాడులు.. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతూ ఒకరు మృతి

ఒకే పార్టీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. కడప జిల్లా కొండాపురం మండలంలోని పి.అనంతపురంలో జరిగిన గొడవలో వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. వైసీపీలోని ఇరువర్గాల ఘర్షణలో గురునాథ్‌రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గండికోట ముంపు పరిహారం జాబితాలో అనర్హులు ఉన్నారంటూ గురునాథ్‌రెడ్డి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు మండల స్థాయి గ్రామసభ నిర్వహించారు. ఇదే క్రమంలో వైసీపీకి చెందిన మరో వర్గం గురునాథ్‌రెడ్డితో గొడవకు దిగింది. దీంతో గురునాథ్‌రెడ్డి వర్గీయులు కూడా వాగ్వివాదానికి దిగారు. రెండు వర్గాల మధ్య మాటలు కాస్త చేతల దాకా వెళ్లింది. దీంతో రెండు గ్రూపులు రాళ్లు, కట్టెలతో పరప్పరం దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన గురునాథ్‌రెడ్డి తాడిపత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు ఆ గ్రామానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.