అమెరికాలో బాల్టిమోర్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి

అమెరికాలోని బాల్టిమోర్‌లో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి పలు ఇళ్లు..

అమెరికాలో బాల్టిమోర్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 11, 2020 | 3:57 PM

అమెరికాలోని బాల్టిమోర్‌లో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. గ్యాస్‌ లీక్‌ కావడంతోనే ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు.పేలుడు సమాచారం అందుకున్న వెంటనే.. ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికిచ చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గ్యాస్‌ లీక్‌ కారణంగా పేలుడు అని అభిప్రాయపడ్డప్పటికీ.. ఏ విధంగా ఈ పేలుడు సంభవించిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం