ఒడిశాలో దీపావళి టపాసులపై నిషేధం

దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆ రాష్ట్రంలో బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించింది.

ఒడిశాలో దీపావళి టపాసులపై నిషేధం
Follow us

|

Updated on: Nov 04, 2020 | 4:32 PM

దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా ఆ రాష్ట్రంలో బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధించింది. ఈ నెల 14వతేదీన దీపావళి, 30వతేదీన కార్తిక పూర్ణిమ పండుగల సందర్భంగా బాణసంచా విక్రయించరాదని, అలాగే కాల్చరాదని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అంక్షలు విధించింది. దీపావళి సందర్భంగా ప్రజలు సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించి ఉత్సవం జరుపుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 10 నుంచి 30వతేదీ వరకు బాణసంచా క్రయ, విక్రయాలపై నిషేధం విధిస్తూ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏకే త్రిపాఠి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి సందర్బంగా టపాసుల విక్రయాలను నిషేధించింది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయుకాలుష్యంతో ప్రజలు మరింత అనారోగ్యానికి గురవుతారని వైద్య నిపుణుల హెచ్చరికలతో అయా రాష్ట్రా ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధిస్తున్నాయి. ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘించి బాణసంచాను విక్రయించినా, కాల్చినా డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్టు 2005 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఒడిశా ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. శీతకాలంలో బాణసంచా కాల్చి వాతావరణాన్ని కలుషితం చేయవద్దని అధికారులు సూచించారు. చలికాలంలో కరోనా వ్యాప్తి పెరుగుతుందని వచ్చిన వార్తలతో ఒడిశా సర్కారు బాణసంచాపై నిషేధం విధించింది. బాణసంచా కాల్చడం వల్ల కరోనాతో హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులు ఇబ్బందులు పడతారని, శ్వాసకోశ సమస్యలున్న వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బాణసంచాపై నిషేధం విధించామని ఒడిశా అధికారులు వెల్లడించారు.

Latest Articles