బర్త్ డే రోజు.. బట్టలు లేకుండా..

Milind Soman Nude  : మోడల్, నటుడు మిలింద్ సోమన్ తన పుట్టిన రోజు వేడుకను డిఫ్రెంట్‌గా జరుపుకున్నాడు. తన 55వ యేట అడుగుపెడుతున్న సందర్భంగా తన లైఫ్ పార్టనర్‌తో కలిసి గోవా బీచ్‌లో జరుపుకున్నాడు. ఇలా వేడుకను జరుపుకోవడంలో ఏం ప్రత్యేకత ఉంటుందని అనుకున్న జంట కొంత కొత్తగా ప్లాన్ చేశాడు. దీనికి తోడు తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో చూపించాడు. ఈ బర్త్ డే సంబరాలకు సంబంధించిన ఫోటోలను మిలింద్ తన ట్విట్టర్ ఖాతాలో […]

  • Sanjay Kasula
  • Publish Date - 5:04 pm, Wed, 4 November 20
బర్త్ డే రోజు.. బట్టలు లేకుండా..

Milind Soman Nude  : మోడల్, నటుడు మిలింద్ సోమన్ తన పుట్టిన రోజు వేడుకను డిఫ్రెంట్‌గా జరుపుకున్నాడు. తన 55వ యేట అడుగుపెడుతున్న సందర్భంగా తన లైఫ్ పార్టనర్‌తో కలిసి గోవా బీచ్‌లో జరుపుకున్నాడు. ఇలా వేడుకను జరుపుకోవడంలో ఏం ప్రత్యేకత ఉంటుందని అనుకున్న జంట కొంత కొత్తగా ప్లాన్ చేశాడు. దీనికి తోడు తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో చూపించాడు.

ఈ బర్త్ డే సంబరాలకు సంబంధించిన ఫోటోలను మిలింద్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఉదయం పూట బీచ్‌లో రన్‌చేస్తూ తన పుట్టిన రోజును ఆహ్వానించాడు. అయితే దీంట్లో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఒంటి మీద నూలిపోగు లేకుండా బీచ్‌లో పరుగులు పెట్టాడు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది.

55వ యేట అడుగుపెట్టినప్పటికి తాను చాలా ఫిట్‌గా ఉన్నాను అని తన అభిమానులకు తన పూర్తి శరీరాన్ని చూపిస్తూ ఫోటో నిర్వహించాడు. అయితే ఈ ఫోటోలు తీసింది ఎవరో కాదు తన భార్య అంకితా కొన్వార్ అని ఆయన తన సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చారు.

ఈ ఫోటోలో తమ అభిమాన నటుడి ఫిట్‌నెస్‌ చూసి ఆయన ఫ్యాన్స్‌ చాలా మంది సంతోషపడుతుంటే మరికొంత మంది మాత్రం ఫన్నీ మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో మీమ్‌లో లాలుప్రసాద్‌ యాదవ్‌ మిలింద్‌కు లోదుస్తులు ఇస్తున్నట్లు ఉంది. ఈ మీమ్స్‌ ప్రస్తుతం ట్రెండ్‌ అవుతూ నవ్వులు పూయిస్తున్నాయి. ఇవే ఫోటోలను సోమన్‌ భార్య అంకిత కోన్వర్‌ కూడా షేర్‌ చేస్తూ తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.