ఇక నుంచి ఏపీ స్కూల్స్‌లో ఇంగ్లీషు సినిమాలు.. ఎందుకంటే?

ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో ఒకటి నుంచి ఆరవ తరగతి వరకూ బోధనను ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు..

ఇక నుంచి ఏపీ స్కూల్స్‌లో ఇంగ్లీషు సినిమాలు.. ఎందుకంటే?
TV9 Telugu Digital Desk

| Edited By:

Mar 06, 2020 | 3:29 PM

ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లల్లో ఒకటి నుంచి ఆరవ తరగతి వరకూ బోధనను ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. పలువురు సాహితీ వేత్తలు, తెలుగు భాషా పండితులు సైతం ఈ విషయంపై ఆందోళనలు వ్యక్తం చేశారు. ఇటీవలే ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి రానున్నట్లు పేర్కొంది. దీంతో వచ్చే విద్యా సంవత్సరానికి ఇంగ్లీషు మీడియంలో పుస్తకాలను ముద్రించి, స్కూళ్లు రీ ఓపెన్ చేసే సరికి అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం.. విద్యాశాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.

అయితే ఒక్కసారిగా భాషను మారిస్తే పిల్లలకు అర్థమయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి.. ముందుగానే.. పిల్లలకు ఇంగ్లీషు మీడియం క్లాసెస్‌ని కండక్ట్ చేస్తున్నారు. అందుకే ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 22 వరకూ ప్రాథమిక బ్రిడ్జి కోర్సు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. దీనిలో భాగంగా.. విద్యార్థులకు ఇల్లు, వ్యక్తిత్వం, మొక్కలు, పండుగలు, జంతువులు, పండ్లు, కూరగాయలు, పూలు, రవాణా, ప్రకృతి తదితర అంశాలకు సంబంధించి బోధనలు చేయనున్నారు. అలాగే ఇంగ్లీషుపై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎడ్యుకేషనల్ సినిమాలను ప్రదర్శిస్తారు. దీంతో.. విద్యార్థులకు అర్థమయ్యే ఛాన్స్ ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu