AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైపర్ ఆది నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు…?

హైపర్ ఆది..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అందరికి సుపరిచితమే. అనతికాలంలో స్టేజ్ కమెడియన్‌గా అసామాన్య ప్రజాదారణ సంపాదించాడు ఆది. అడల్ట్ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తాడన్న పేరున్నా కూడా..అతని కామెడీ స్కిట్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం టీవీ రేటింగ్‌ల పరంగానే కాదు, యూట్యూబ్‌లో స్కిట్ రిలీజైన రెండు రోజులవరకు అదే ట్రెండింగ్. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ సత్తా చాటుతున్న ఇతడికి అనూహ్య పరిణామం ఎదురైంది. ఇటీవల విశాఖలో పోలీసులు చేసిన దాడుల్లో..జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, […]

హైపర్ ఆది నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు...?
Ram Naramaneni
|

Updated on: Mar 06, 2020 | 9:53 PM

Share

హైపర్ ఆది..తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అందరికి సుపరిచితమే. అనతికాలంలో స్టేజ్ కమెడియన్‌గా అసామాన్య ప్రజాదారణ సంపాదించాడు ఆది. అడల్ట్ పంచ్‌లు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వేస్తాడన్న పేరున్నా కూడా..అతని కామెడీ స్కిట్‌లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం టీవీ రేటింగ్‌ల పరంగానే కాదు, యూట్యూబ్‌లో స్కిట్ రిలీజైన రెండు రోజులవరకు అదే ట్రెండింగ్. ఇప్పుడిప్పుడే సినిమాల్లోనూ సత్తా చాటుతున్న ఇతడికి అనూహ్య పరిణామం ఎదురైంది.

ఇటీవల విశాఖలో పోలీసులు చేసిన దాడుల్లో..జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, పరదేశి పట్టుబడటం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయితే పట్టుబడిన ఇద్దరూ కూడా హైపర్ ఆది టీమ్‌కు చెందినవారే. అందులోనూ దొరబాబు..జబర్దస్త్‌కు రాకముందు బి గ్రేడ్ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాడు. అతనిపై ఆ తరహా పంచులు వేయబట్టే ఫేమస్ అయ్యాడు. మరి హైపర్ ఆది వారిని టీమ్‌లో కంటిన్యూ చేస్తాడా..?  ఉంటే ప్రస్తుత అంశాన్ని పంచ్‌లుగా మలుస్తాడా అనేది చూడాల్సి ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో వీరిద్దరూ కనిపించకపోవడంతో వారిని షో నుంచి తీసివేశారనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే జబర్దస్త్‌ నిర్మాణ సంస్థ మల్లెమాల వర్గాల నుంచి వస్తోన్న సమాచారం వేరే ఉంది. పట్టుబడిన ఇద్దరూ కూడా వ్యక్తిగతంగా మంచి మనుషులని, ఇటువంటి పనులు ఎందుకు చేశారో తెలియదంటున్నారు. ముఖ్యంగా పరదేశికి తండ్రి కూడా లేరట. సినిమాల్లో నటించాలని, గత ఆరేళ్లుగా ప్రయత్నిస్తుండగా..ఇటీవలే కొద్ది కొద్దిగా అవకాశాలు వస్తున్నాయి.  ఏది ఏమైనా ఇప్పుడిప్పుడే కెరీర్ నిలదొక్కుకుంటోన్న దశలో టీవీ ఆర్టిస్ట్‌లు ఇద్దరూ చేతులారా జీవితంలోకి చిక్కులను ఆహ్వానించారు.

Follow Us
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
సంకల్ప బలంతో అసాధ్యమేదీ కాదు.. మోరిస్ గుడ్‌మాన్‌ కథ మీకు చెప్పాలి
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
డిజిటల్ చెల్లింపులు పెరిగినా నగదుకు తగ్గని డిమాండ్.. భారత్‌లో..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
రైతన్నలూ.. మెరుగైన ఆదాయం కావాలంటే ఈ సలహాలు పాటించండి..
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..