Shocking Video.. “గజరాజు” గజగజ వణికింది.. అది కూడా చిన్న దూడకి..

ఎవరి సామర్ధాలను తక్కువ అంచనా వేయలేమన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా అడవుల్లో తరచూ కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి దున్నపోతుల సమూహం.. సింహాల గుంపును తరిమే సన్ని వేశాలు చూస్తుంటాం. అంతేకాదు.. కొన్ని అడవి కుక్కలు, హైనాలు.. పులులపై, సింహాలపై దాడి చేయడం.. వీలైతే వాటిని హతమార్చి.. భుజించడం చూస్తుంటాం. కానీ సౌతాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్క్‌లో జరిగిన ఓ విచిత్ర సన్నివేశం ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఓ నెలలు […]

Shocking Video.. గజరాజు గజగజ వణికింది.. అది కూడా చిన్న దూడకి..
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 3:41 PM

ఎవరి సామర్ధాలను తక్కువ అంచనా వేయలేమన్న విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా అడవుల్లో తరచూ కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి దున్నపోతుల సమూహం.. సింహాల గుంపును తరిమే సన్ని వేశాలు చూస్తుంటాం. అంతేకాదు.. కొన్ని అడవి కుక్కలు, హైనాలు.. పులులపై, సింహాలపై దాడి చేయడం.. వీలైతే వాటిని హతమార్చి.. భుజించడం చూస్తుంటాం. కానీ సౌతాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్క్‌లో జరిగిన ఓ విచిత్ర సన్నివేశం ఇప్పుడు నెటిజన్లు విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఓ నెలలు కూడా నిండని దూడ.. ఏకంగా ఓ గజరాజుని వణికించింది. భారీ ఏనుగు ఒకటి.. అలా నడుచుకుంటూ వస్తోంది. అదే సమయంలో అటువైపు.. తల్లితో కలిసి ఓ చిన్న దూడ వస్తోంది. అయితే ఆ ఏనుగు ఆ దూడవైపు వస్తుంటే.. ఏమాత్రం భయం లేకుండా.. ఆ గజరాజు కాళ్ల దగ్గరకు వెళ్తూ.. యుద్ధానికి సై అన్నట్లు ప్రవర్తించింది. అంతేకాదు.. ఆ లేగదూడ బెదిరింపులకు హడలిపోయిన గజరాజు.. వెనుకడుగు వేస్తూ.. పరుగులు పెట్టింది. అయితే అలా దూడ ఆ గజరాజును తరుముతుంటే.. తన దూడను ఆ ఏనుగు ఏమైనా చేస్తుందేమోననే భయంతో గేదె కూడా దాని వెంట పరుగులు పెట్టింది. అయితే ఆ దూడ ఏ మాత్రం భయపడకుండా గజరాజుని తరిమేసింది. దాదాపు 17 సెకన్లపాటు ఉన్న ఈ దూడ- ఏనుగుల సన్నివేశం.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.