Tandav Web Series: అమెజాన్ ప్రైమ్‌కు సమన్లు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం… హిందూ దేవతలను అపహాస్యం చేసేలా ఉందంటూ..
Notice To Amazon Prime: బాలీవుడ్ ప్రముఖ హీరోగా సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్‌సిరీస్ 'తాండవ్'. భారతదేశ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేశారు...
Notice To Amazon Prime: బాలీవుడ్ ప్రముఖ హీరోగా సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్‌సిరీస్ ‘తాండవ్’. భారతదేశ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేశారు. ఎన్నో అంచనాల నడుమ ఈ వెబ్ సిరీస్ జనవరి 15 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో విడదలైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ వెబ్ సిరీస్ వివాదాలతో సావాసం చేస్తోంది. ఈ వెబ్‌సిరీస్‌లో హిందూ దేవుళ్లను అవమానిస్తూ.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సన్నివేశాలు ఉన్నాయంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తాండవ్ మేకర్స్‌కు సమన్లు జారీ చేసింది. ఇక అంతకు ముందు ‘తాండవ్’ వెబ్ సిరీస్‌లో కొన్ని సన్నివేశాలు మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ.. భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబయిలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ భాజపా ఎంపీ మనోజ్‌కుమార్ కొటక్ కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖ రాశారు. మరోవైపు వెబ్‌సిరీస్‌పై వ్యతిరేకత పెరగడంతో ముందస్తు జాగ్రత్తగా ముంబయి శివారులో ఉన్న సైఫ్ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.