Sidharth Malhotra: అంకుల్, ఆంటీ ఉన్నంత మాత్రాన బాలీవుడ్ లో నటుడిగా ప్రయాణం అంత ఈజీ కాదు : సిద్ధార్థ్

బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. వారసత్వం ఉంటే సినీ ఇండస్ట్రీ లో జర్నీ సులభమని అందరూ అనుకుంటారు... అయితే వాస్తవాలు ప్రజల అభిప్రాయానికి భిన్నంగా..

Sidharth Malhotra: అంకుల్, ఆంటీ ఉన్నంత మాత్రాన బాలీవుడ్ లో నటుడిగా ప్రయాణం అంత ఈజీ కాదు : సిద్ధార్థ్
Follow us

|

Updated on: Jan 17, 2021 | 5:00 PM

Sidharth Malhotra: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. వారసత్వం ఉంటే సినీ ఇండస్ట్రీ లో జర్నీ సులభమని అందరూ అనుకుంటారు… అయితే వాస్తవాలు ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఉంటాయన్నాడు.  బాలీవుడ్ లో నటుడి ప్రయాణం అంత సులభం కాదని చెప్పాడు. తాను స్టార్ ప్రొడ్యూసర్ , డైరెక్టర్ కరణ్ జోహార్ సినిమాతో నటుడిగా అడుగు పెట్టినా నటుడిగా అవకాశాలు అందుకోవానికి అనేక కష్టాలు పడ్డానని చెప్పాడు. ఢిల్లీ నుంచి ముంబై వరకూ తన ప్రయాణంలో అనేక మజిలీలు ఉన్నాయని చెప్పాడు. అవకాశాల కోసం తనను ఎవరూ రికమండ్ చేయలేదు.. తప్పులనుంచి పాఠాలు నేర్చుకుంటూ.. తనని తాను నిరూపించుకుని.. ఈ రోజు బాలీవుడ్ లో నటుడిగా ఓ గుర్తింపు తెచ్చుకున్నా అన్నాడు సిద్దార్ధ్.

పాకెట్ మనీ కోసం తాను మోడలింగ్ చేసినట్లు 20 వ దశకం మధ్యలో దోస్తానా, మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసినట్లు చెప్పాడు. ప్రతి కష్టాన్ని ఇష్టంగా పడడంతోనే ఈ రోజు సక్సెస్ అందుకున్నాను అన్నాడు. ముంబై లో అడుగు పెట్టాక తన కుటుంబానికి దూరంగా ఉన్నానని.. మలాడ్ ఈస్ట్ నుంచి బాంద్రాకు రావడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టిందని ముంబై లో తన ప్రయాణం చెప్పాడు గత పదేళ్ల నుంచి తనకు ముంబై అనేక విషయాలు నేర్పిందన్నాడు సిద్ధార్థ్ మల్హోత్రా.

బాలీవుడ్‌లో మనుగడ సాగించడం అంత సులభం కాదు. ఎందుకంటే మనం నటించిన సినిమాలు ప్లాప్ అయితే అవి నటుడి జీవితంపై ప్రభావం చుపిస్తాయని సిద్ధార్థ్ గుర్తుచేసుకున్నాడు. అయితే తనకు ఇంకా ఉత్తమైన క్యారెక్టర్ రాలేదని.. నటుడిగా నిరూపించుకునే పాత్రకోసం ఎదురుచూస్తున్నాని చెప్పాడు. తనకు ప్రయాణం, క్రీడలు, వ్యాయామం, గుర్రపు స్వారీ ఇష్టమని చెప్పాడు.

Also Read: లక్షణాలు, టెస్టుల కంటే ముందుగానే కరోనా వైరస్ మనశరీరంలో ఉన్నదీ..లేనిది గుర్తించే వాచ్.. !