మోదీకి ఈసీ క్లీన్ చిట్..!

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్‌లోని పటాన్‌లో ఆయన చేసిన ప్రసంగాన్ని పరిశీలించిన ఈసీ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించలేదని చెప్పింది. మూడో దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ప్రధాని మోదీ ప్రసంగిస్తూ భారతీయ వాయుసేన పైలెట్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్థాన్ తిరిగి అప్పజెప్పకపోయుంటే ఆ రోజు ‘కతల్ కీ రాత్’ (ఊచకోతల రాత్రి) అయ్యేదన్నారు. బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ భారత సైనిక […]

మోదీకి ఈసీ క్లీన్ చిట్..!
Follow us
Ravi Kiran

|

Updated on: May 05, 2019 | 7:06 AM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. గుజరాత్‌లోని పటాన్‌లో ఆయన చేసిన ప్రసంగాన్ని పరిశీలించిన ఈసీ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించలేదని చెప్పింది.

మూడో దశ ఎన్నికల ప్రచారం చివరి రోజున ప్రధాని మోదీ ప్రసంగిస్తూ భారతీయ వాయుసేన పైలెట్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్థాన్ తిరిగి అప్పజెప్పకపోయుంటే ఆ రోజు ‘కతల్ కీ రాత్’ (ఊచకోతల రాత్రి) అయ్యేదన్నారు. బాలాకోట్ వైమానిక దాడులను ప్రస్తావిస్తూ, పాకిస్థాన్ భారత సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకొని వైమానిక దాడులకి ప్రయత్నించిందని.. కానీ ఐఏఎఫ్ వేగంగా స్పందించి వాటిని తిప్పికొట్టడంతో పాటు వాళ్ల ఒక జెట్‌ను ధ్వంసం చేసిందని చెప్పారు. ఇక ప్రధాని మోదీ చేసిన ఈ ప్రసంగం నిస్సిగ్గుగా, సాయుధ దళాలకు నిర్లక్ష్యంగా ఇచ్చిన పిలుపుగా ఉందంటూ కాంగ్రెస్, సీపీఐ(ఎం) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.