ఇంటర్ ఫలితాల బాధ్యత ఆ సంస్థకే.!

ఇంటర్ జవాబు పత్రాల రీ- వాల్యువేషన్, వెరిఫికేషన్, ఫలితాల ప్రక్రియను డేటా టెక్ మేధోడెక్స్ సంస్థకు అప్పగించింది ఇంటర్ బోర్డు. దీంతో ఈ సంస్థ గ్లోబరీనాతో పాటు సమాంతరంగా ఫలితాలను ప్రాసెసింగ్ చేయనుంది. 12 మూల్యాంకన కేంద్రాల్లో రీ- వెరిఫికేషన్‌ కొనసాగుతున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. రీ- వెరిఫికేషన్‌, ఫలితాల వెల్లడిపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల తలెత్తడంతో ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలు […]

ఇంటర్ ఫలితాల బాధ్యత ఆ సంస్థకే.!
Follow us
Ravi Kiran

|

Updated on: May 05, 2019 | 7:36 AM

ఇంటర్ జవాబు పత్రాల రీ- వాల్యువేషన్, వెరిఫికేషన్, ఫలితాల ప్రక్రియను డేటా టెక్ మేధోడెక్స్ సంస్థకు అప్పగించింది ఇంటర్ బోర్డు. దీంతో ఈ సంస్థ గ్లోబరీనాతో పాటు సమాంతరంగా ఫలితాలను ప్రాసెసింగ్ చేయనుంది. 12 మూల్యాంకన కేంద్రాల్లో రీ- వెరిఫికేషన్‌ కొనసాగుతున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. రీ- వెరిఫికేషన్‌, ఫలితాల వెల్లడిపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇంటర్ ఫలితాల్లో అవకతవకల తలెత్తడంతో ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. గ్లోబరీనాకు సమాంతరంగా మరో సంస్థతోనూ ఫలితాల ప్రాసెసింగ్‌ చేయించాలని త్రిసభ్య కమిటీ సూచించడంతో.. మరో కంప్యూటర్‌ ఏజెన్సీ ఎంపిక బాధ్యతను రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సేవల విభాగానికి అప్పగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రాసెసింగ్‌ ప్రక్రియను నోడియాకు చెందిన డేటా టెక్‌ మెథోడెక్స్‌ సంస్థకు అప్పగిస్తున్నట్టు బోర్డు వెల్లడించింది.