ఐదవ విడత ఎన్నికలకు సర్వం సిద్ధం..!
దేశవ్యాప్తంగా రేపు జరగనున్న ఐదో దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 2 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ దశలో కీలక నేతలు పోటీ పడనున్నారు. రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీలు […]
దేశవ్యాప్తంగా రేపు జరగనున్న ఐదో దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, రాజస్థాన్‌లో 12, పశ్చిమ బెంగాల్‌లో 7, మధ్యప్రదేశ్‌లో 7, బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 4, జమ్మూకశ్మీర్‌లో 2 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఇక ఈ దశలో కీలక నేతలు పోటీ పడనున్నారు. రాయ్ బరేలీ నుంచి సోనియా గాంధీ, అమేథీ నుంచి రాహుల్ గాంధీలు పోటీచేస్తోండగా, బీజేపీ తరపున కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ అమేథీ నుంచి పోటీలో ఉన్నారు. లక్నో లోక్‌సభ స్థానానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీపడుతుండగా, ఎస్పీ నుంచి పూనమ్ సిన్హా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఐదో విడత ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈసీ ఏర్పాట్లుపై దృష్టి సారించింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటోంది.