173 ఏళ్ల చరిత్రగల చేప ప్రసాదానికి.. కరోనా బ్రేక్..!

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. మృగశిర కార్తె రోజు హైదరాబాద్ నగరంలో పంపిణీచేసే చేప ప్రసాదం

173 ఏళ్ల చరిత్రగల చేప ప్రసాదానికి.. కరోనా బ్రేక్..!
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 4:24 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దీని కట్టడికోసం సామజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి. మృగశిర కార్తె రోజు హైదరాబాద్ నగరంలో పంపిణీచేసే చేప ప్రసాదం గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చేప ప్రసాదం పై బత్తిని హరినాథ్ గౌడ్ టీవీ9 తో మాట్లాడుతూ.. గత 173 ఏళ్లుగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈసారి కరోనావైరస్ మహమ్మారి వల్ల పంపిణీకి బ్రేక్ వచ్చిందని అన్నారు. అయితే, ఆస్తమా రోగులకు చేపప్రసాదం ఆరోగ్యప్రదాయిని.

కాగా.. ఈ ఏడాది చేప ప్రసాదం తయారు చేస్తాం, కానీ పంపిణీ ఉండదని తెలిపారు. అయితే, చేపప్రసాదానికి ప్రత్యామ్నాయంగా అలోపతి వాడొద్దని హరినాథ్ గౌడ్ స్పష్టంచేశారు. ఈసారి కేవలం తమ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ రద్దు చేసుకున్నామని విన్నవించారు. చేప ప్రసాదం పేరుతో ఎవరైనా పంపిణీ ఉందని చెబితే మోసపోవద్దని హరినాథ్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా ప్రచారంచేస్తే పోలీసు శాఖకు ఫిర్యాదు చేయండని చెప్పారు.

Also Read: అంగన్‌వాడీల్లో ‘నాడు – నేడు’.. సీఎం జగన్ కీలక నిర్ణయం..