ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు..!

ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా బాధతులను నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలతో కూడిన ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వానికి ఐసీఎంఆర్ అందజేసింది.

ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు..!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 4:08 PM

కరోనా మహమ్మారి దేశాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొవిడ్-19 బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రయివేట్ ఆస్పత్రులు కరోనా బాధతులను నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో భారతీయ వైద్య మండలి స్పందించింది. ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలతో కూడిన ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేటు ఆస్పతుల్లోనూ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి. దీంతో భారత వైద్య పరిశోధనామండలి ఐసీఎంఆర్ సీరియస్ గా తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు చికిత్సలందించడానికి వసూలు చేయాల్సిన ఫీజుల వివరాలను ప్రకటించింది. పాజిటివ్‌ లక్షణాలు ఉండి, ఆరోగ్య పరిస్థితి క్షిణించి ఉంటే 10 రోజుల చికిత్సకు రూ.2,31,820లను ఫీజుగా వసూలు చేయాలని తెలిపింది. కరోనా వైరస్‌ సోకిన సాధారణ రోగులకు మాత్రం రోజుకు రూ.23,182 వంతున ఫీజులు వసూలు చేయాలని సూచించింది. అాలాగే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న పేషెంట్స్ నుంచి రోజుకు రూ.25,377 చొప్పున 17 రోజులకు రూ.4,31,411లను వసూలు చేయాలని వివరించింది. కరోనా బాధితులకు చికిత్సలతోపాటు పౌషికాహారం, అన్ని సదుపాయాలకు గానూ రోజుకు రూ.9,600 లకు మించకుండా వసూలు చేయాలని భారతీయ వైద్యమండలి తెలిపింది. ఐసీఎంఆర్ ప్రతిపాదనలపై తమిళ సర్కార్ చర్చించి ఫీజుల వివరాలను ఖరారు చేయనుంది.

హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉన్నవారికి శుభవార్త.. నిబంధనలలో మార్పులు
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
CSKకు భారీ ఎదురు దెబ్బ.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
'14ఏళ్లు సీఎంగా చంద్రబాబు బందరుకు ఏం చేశారు'.. పేర్ని నాని
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
వేసవి ఉపశమనం కోసం వంటించి చిట్కాలు.. ఈ సూపర్ డ్రింక్స్ మీ కోసం..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
నిన్ను నా సినిమాలోకి తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నా..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు.. ఉదయాన్నే తింటే ఇక నో టెన్షన్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
భారత పర్యటనకు ముందు ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
తన ఇంట్లో చొరబడ్డ దొంగలకు డబ్బు సాయం చేసిన టాలీవుడ్ యాక్టర్
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
మాట నిలబెట్టుకున్నలారెన్స్.. దివ్యాంగులకు ఇళ్లు, బైక్స్ .. వీడియో
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...
ప్రభాస్‏ను కాపీ కొట్టిన హీరోయిన్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే...