మూన్ లాండర్ తో నో కాంటాక్ట్.. అది విఫలమైనట్టే.. ఇక గగన్ యాన్ పై దృష్టి ..

మూన్ లాండర్ తో నో కాంటాక్ట్.. అది విఫలమైనట్టే.. ఇక గగన్ యాన్ పై దృష్టి ..

చంద్రయాన్-2 లాండర్ విక్రమ్ ని కాంటాక్ట్ చేయలేకపోయామని ఇస్రో చీఫ్ కె. శివన్ ప్రకటించారు. దాన్ని కాంటాక్ట్ చేయడానికి గల 14 రోజుల డెడ్ లైన్ శనివారంతో ముగిసిందని ఆయన చెప్పారు. అయితే చంద్రుని ఉపరితలంపై లాండర్ ఈ నెల 7 న సాఫీగా దిగి చరిత్ర సృష్టించిందని అన్నారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ బాగా పని చేస్తోందని, ఆర్బిటర్లో ఉన్న ఎనిమిది సాధనాలు చక్కగా వాటి ‘ విధులు అవి నిర్వరిస్తున్నాయని ‘ శివన్ వెల్లడించారు. కానీ […]

Pardhasaradhi Peri

|

Sep 21, 2019 | 5:50 PM

చంద్రయాన్-2 లాండర్ విక్రమ్ ని కాంటాక్ట్ చేయలేకపోయామని ఇస్రో చీఫ్ కె. శివన్ ప్రకటించారు. దాన్ని కాంటాక్ట్ చేయడానికి గల 14 రోజుల డెడ్ లైన్ శనివారంతో ముగిసిందని ఆయన చెప్పారు. అయితే చంద్రుని ఉపరితలంపై లాండర్ ఈ నెల 7 న సాఫీగా దిగి చరిత్ర సృష్టించిందని అన్నారు. చంద్రయాన్-2 ఆర్బిటర్ బాగా పని చేస్తోందని, ఆర్బిటర్లో ఉన్న ఎనిమిది సాధనాలు చక్కగా వాటి ‘ విధులు అవి నిర్వరిస్తున్నాయని ‘ శివన్ వెల్లడించారు. కానీ లాండర్ తో కమ్యూనికేషన్ తెగిపోవడమే విచారకరమన్నారు. అసలు లాండర్ కు ఏం జరిగింది ? అది తెలుసుకోవడమెలా అన్నదే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. ఇక మా తదుపరి లక్ష్యం గగన్ యాన్ మిషన్ అని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-2 మిషన్ 98 శాతం సక్సెస్ అయింది. ఈ విజయం ద్వారా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మనం ఘనం అని చాటగలిగాం..టెక్నాలజీకి సంబంధించినంత వరకు దాదాపు పూర్తి విజయం సాధించాం అని శివన్ అన్నారు. వచ్ఛే ఏడాదికి మరో మూన్ మిషన్ పై ఇస్రో దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. అటు-లాండర్ ఆచూకీ కనుగొనేందుకు నాసా యత్నించిన విషయాన్ని ఆయన దాటవేశారు. బహుశా ఇస్రో చెబుతున్న దాన్నే నాసా కూడా మరోరకంగా ప్రకటించి ఉంటుందని శివన్ భావించినట్టు కనబడుతోంది. లాండర్ తో కాంటాక్ట్ తెగిపోయినప్పటికీ.. చంద్రునికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఆర్బిటర్ ఏడాదిపాటు ‘ శ్రమిస్తూనే ఉంటుంది ‘.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu